AP News: శ్రీవారి దర్శన టికెట్లపై రీషెడ్యూల్‌ సదుపాయం

తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబరు 18 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శన తేదీని

Updated : 04 Dec 2021 14:01 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబరు 18 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శన తేదీని రీషెడ్యూల్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆయా తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేకపోయినవారు ఆరునెలల్లోపు దర్శన స్లాట్లను రీషెడ్యూల్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. 

లింకురోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు

అలిపిరి-తిరుమల రెండోఘాట్‌ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింకు రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి ఘాట్‌రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందున అలిపిరి, లింకు బస్టాండ్‌, తిరుమలలో భక్తులు గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. వీరి ఇబ్బందులను తొలగించడానికి లింకురోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలను అనుమతించనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రెండో ఘాట్‌రోడ్డును, రక్షణ గోడల పునర్నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్‌రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండచరియలోని మిగిలిన సగభాగం రోడ్డుమీద పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా శాశ్వత చర్యలపై దృష్టిపెట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని