Published : 12/06/2021 01:47 IST

షోకులు చూడయా!

నయా ఫ్యాషన్‌

త్యాధునికంగా, ఆకట్టుకునేలా కనిపించాలనుకునే కుర్రకారు బాడీ పియర్సింగ్‌ చేయించుకుంటుంటారు. కనురెప్పలు, నాలుక, నాభి.. ఇలా నచ్చిన ప్రదేశంలో పియర్సింగ్‌ వేయించుకుంటుంటారు. దీనికి మరింత అడ్వాన్స్‌డ్‌గా మరో ఫ్యాషన్‌ వచ్చేసింది. ఇది ‘చిన్‌ జ్యువెల్లరీ’. అంటే కింది పెదవి భాగం నుంచి కనికట్టు చేసే ఫ్యాషన్‌. జర్మన్‌ కంపెనీ ఎంవైఎల్‌ మొదటిసారి ఈ ఫ్యాషన్‌ని తెరపైకి తెచ్చింది. కానీ ఇది ఎప్పుడో హద్దులు దాటి అన్నిదేశాల కుర్రకారుని చుట్టేస్తోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని అమ్మాయిలు, అబ్బాయిలు ఈ స్టైల్‌కి ఫిదా అయిపోతున్నారు. దీంట్లో కింది పెదవికి లోపలివైపు రెండు హుక్స్‌ తగిలించి పియర్సింగ్‌ చేయించుకొని అబ్బాయిలు షో మ్యాన్‌గా, అమ్మాయిలు షీరోలుగా మారిపోతున్నారు. ఈ డిజైన్స్‌ని తేలికైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, గోల్డ్‌, సిల్వర్‌.. మెటీరియల్‌తో రూపొందిస్తారు.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని