Published : 26/04/2020 01:09 IST

మామిడిపండ్లతో థాయ్‌ విందు...

పొరుగింటి పుల్లకూర

నవనవలాడే అరిటాకులో అప్పుడే తాజాగా కోసి ఉంచిన మామిడిపండుముక్కలు.. ఆ పక్కనే కొబ్బరిపాలతో వండిన అన్నం. చూడ్డానికైతే కన్నుల వేడుకగా ఉంటుంది. తినడానికి ఎలా ఉంటుంది అంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం అంటారు థాయిలాండ్‌ వాసులు. థాయ్‌ ప్రజలు వేసవి కాలంలో వండుకునే సంప్రదాయ వంటకం ఈ స్టికీరైస్‌.

ఎండాకాలంలో మండే ఎండల సంగతి అటుంచి.. ఇప్పుడు మాత్రమే దొరికే మామిడిపండ్లను ఎంతో ఇష్టంగా ఆరగిస్తాం. మామిడిపండ్ల ముక్కలు, రసం వేటినీ వదిలిపెట్టం. కొందరు మామిడిపండును పెరుగన్నంలోనూ నంజుకుంటారు. మరికొందరైతే పండురసాన్ని పెరుగన్నంలో కలిపేసుకుంటారు. థాయ్‌లాండ్‌ వాసులు మాత్రం ప్రత్యేకంగా ‘మ్యాంగో స్టికీ రైస్‌’ను తయారుచేస్తారు. అక్కడ వేసవిలో వడ్డించే సంప్రదాయ వంటకమిది. ఇళ్లలోనే కాకుండా రెస్టారెంట్లలోనూ అందుబాటులో ఉంటుంది. అతిథులకు ఎంతో ఇష్టంగా దీన్ని వడ్డిస్తారు. ఒక్క థాయ్‌లాండ్‌లోనే కాకుండా ఇండోనేషియా, కంబోడియా, వియత్నాంలో కూడా చాలాఇష్టంగా ఈ వంటకాన్ని ఆరగిస్తారట. థాయ్‌ వంటకాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన దీన్ని ఎలా తయారుచేయాలంటే...

కావాల్సినవి: బియ్యం- కప్పు, మామిడిపండ్లు- రెండు, నీళ్లు- ఒకటిన్నర కప్పులు, బ్రౌన్‌ షుగర్‌- అయిదు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- తగినంత, చిక్కటి కొబ్బరిపాలు- ఆరు కప్పులు.

తయారీ: గిన్నెలో బియ్యాన్ని తీసుకుని కప్పు నీళ్లలో అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు గిన్నెను స్టవ్‌ మీద పెట్టి, మరో అరకప్పు నీళ్లు, మూడు కప్పుల కొబ్బరిపాలు, ఉప్పు, టేబుల్‌ స్పూన్‌ బ్రౌన్‌షుగర్‌ వేసి బాగా కలపాలి. ఇప్పుడు గిన్నె మీద మూతపెట్టి అరగంటపాటు లేదా అన్నం కొబ్బరిపాలను పూర్తిగా పీల్చుకునే వరకు ఉడకనివ్వాలి.

సాస్‌ కోసం..

మిగిలిన కొబ్బరిపాలను తక్కువ మంట మీద వేడిచేయాలి. వీటిలో మూడు టేబుల్‌ స్పూన్ల బ్రౌన్‌షుగర్‌ కలిపి తీపి సరి చూసుకోవాలి. కావాలనుకుంటే మరికాస్త షుగర్‌ వేసుకోవచ్ఛు కానీ అన్నంలో కంటే సాస్‌లో ఎక్కువ తీపి ఉండకుండా చూసుకోవాలి. తర్వాత మామిడి పండ్లను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు అన్నం ప్లేట్‌లోకి తీసుకుని దాని మీద కొబ్బరిపాల సాస్‌ను అన్నం మునిగిపోయేలా పోసుకోవాలి. దీని మీద మామిడిపండు ముక్కలు వేసుకోవాలి. వీటి మీద కూడా కొద్దిగా సాస్‌ వేసుకుని మ్యాంగో స్టిక్కీరైస్‌ను ఆరగించాలి.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని