చూపు సమస్యలతో కుంగుబాటు ముప్పు

చూపు సమస్యలతో బాధపడుతున్నారా? వీలైనంత త్వరగా సరి చేసుకోవటం మంచిది. దీంతో మున్ముందు హాయిగా జీవించేలా చూసుకోవచ్చు. మధ్యవయసులో చూపు సమస్యలతో మహిళలకు కుంగుబాటు (డిప్రెషన్‌) ముప్పు పెరుగుతున్నట్టు

Updated : 09 Nov 2021 01:00 IST

చూపు సమస్యలతో బాధపడుతున్నారా? వీలైనంత త్వరగా సరి చేసుకోవటం మంచిది. దీంతో మున్ముందు హాయిగా జీవించేలా చూసుకోవచ్చు. మధ్యవయసులో చూపు సమస్యలతో మహిళలకు కుంగుబాటు (డిప్రెషన్‌) ముప్పు పెరుగుతున్నట్టు బయటపడింది మరి. సాధారణంగా మగవారి కన్నా ఆడవారిలో కుంగుబాటు ఎక్కువ. మధ్యవయసు మహిళల్లో ఇది మరింత ఎక్కువగానూ చూస్తుంటాం. చూపు సమస్యలు గలవారికి దీని ముప్పు ఇంకాస్త అధికంగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. మధ్యవయసులో చూపు తగ్గటం, శుక్లాల వంటి సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. ఇవే కాదు.. శుక్లాలు, డయాబెటిక్‌ రెటినోపతీ, మాక్యులా క్షీణించటం వంటి తీవ్ర, దీర్ఘకాల సమస్యలూ వేధిస్తుంటాయి. వీటిని వీలైనంత త్వరగా గుర్తించి, తగు చికిత్స తీసుకోవటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో కుంగుబాటునూ తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. లేకపోతే కుంగుబాటు మున్ముందు దీర్ఘకాల సమస్యలకు దారితీసే ప్రమాదముందని గుర్తుచేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని