బోధన రంగంలో...

బీఏ (హిస్టరీ, పొలికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఈడీలో సోషల్‌ మెథడాలజీ చదివాను. 

Published : 02 Dec 2021 11:56 IST

బీఏ (హిస్టరీ, పొలికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌), బీఈడీలో సోషల్‌ మెథడాలజీ చదివాను. ఎంఏలో ఏ సబ్జెక్టు తీసుకుంటే ప్రభుత్వ కళాశాలలో లేదా పాఠశాలలో టీచింగ్‌ ఉద్యోగానికి అవకాశాలు ఉంటాయి?- కల్యాణ్‌ కృష్ణ

- పాఠశాలల్లో బోధన చేయదలిస్తే బీఏ, బీఈడీ అర్హత సరిపోతుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో, నవోదయ విద్యాలయాల్లో, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తున్న పాఠశాలల్లో 11, 12 తరగతుల బోధన కోసం పీజీ టీచర్‌లను నియమిస్తారు. పీజీటీ ఉద్యోగాలకు బీఈడీ తో పాటు, సంబంధిత సబ్జెక్టులో పీజీ కూడా చేసి ఉండాలి. డిగ్రీలో చదివిన హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి స్కూళ్లలో, కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. కంప్యూటర్స్‌ గురించిన ప్రాథ]మిక పరిజ్ఞానం మీకు అదనపు అర్హతగా పనికివస్తుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో పనిచేయాలంటే ఇంగ్లిషు, హిందీ భాషల్లో కూడా బోధించగల సామర్ధ్యం పెంచుకోవాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని