close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సుస్థిర వ్యవసాయం ద్వారానే ఆహార భద్రత

గవర్నర్‌ తమిళిసై

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో సుస్థిర వ్యవసాయం ద్వారానే ఆహారభద్రత సాధ్యమవుతుందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. మద్రాస్‌ తూర్పు రోటరీ క్లబ్‌ శనివారం చెన్నై నుంచి దృశ్యమాధ్యమంలో నిర్వహించిన డాక్టర్‌ స్వామినాథన్‌ పురస్కార కార్యక్రమంలో ఆమె ఇక్కడి నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. దేశానికి హరిత విప్లవం ఎంతో మేలు చేసిందన్నారు. ఇందులో స్వామినాథన్‌ కృషి ఎంతో ఉందని చెప్పారు.  సుస్థిర వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణకు  చేసిన కృషికి గుర్తింపుగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ పరోడాకు స్వామినాథన్‌ పురస్కారాన్ని ఈ సందర్భంగా అందజేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.