close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల్లో..

14వ స్థానంలో తెలంగాణ
ఏపీకి 25వ స్థానం

ఈనాడు, దిల్లీ ఆంధ్రప్రదేశ్‌లో వైద్యపరంగా ధ్రువీకరించే మరణాలు కేవలం 14.9% మాత్రమే ఉన్నట్లు కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన ‘రిపోర్ట్‌ ఆన్‌ మెడికల్‌ సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కాజ్‌ ఆఫ్‌ డెత్‌-2018’ నివేదిక వెల్లడించింది. తెలంగాణలో ఇది 37.4%గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ దేశంలో 25వ స్థానంలో, తెలంగాణ 14వ స్థానంలో ఉన్నాయి.  దేశ సగటు 21.1%. దాదాపు 15 రాష్ట్రాల్లో ఈ శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. గోవా అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ మరణాలన్నింటినీ 100% వైద్యపరంగా ధ్రువీకరిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలైన తమిళనాడులో 45%, తెలంగాణలో 37.4, మహారాష్ట్రలో 34.8, కర్ణాటకలో 31.1, గుజరాత్‌లో 23.4 శాతంగా ఉంది. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో 3,75,777 మరణాలు నమోదుకాగా అందులో కేవలం 55,933 మరణాలకు మాత్రమే కారణాలను వైద్యపరంగా ధ్రువీకరించారు. ఇదే సంవత్సరం తెలంగాణలో  1,36,528 మరణాలు నమోదుచేయగా అందులో కేవలం 51,068 మరణాలకు మాత్రమే కారణాలను వైద్యపరంగా ధ్రువీకరించారు. దేశంలోని మరణాలను 8 ప్రధాన గ్రూపులుగా విభజించారు.


తెలంగాణలో మరణాలు ఇలా...
గుండె, ఊపిరితిత్తుల సమస్యతో: 51. 9%
గాయాలకు ఇన్‌ఫెక్షన్‌వంటి వాటితో 13.5%
శ్వాసకోశ ఇబ్బందులతో 6.3%
ఇన్‌ఫెక్షన్‌, ప్యారాసైటిక్‌ వ్యాధుల వల్ల 6.3%
ప్రసవకాల సమస్యలతో 2.8%
కణితలతో 3.1%
పోషక, జీవక్రియ వ్యాధులతో   0.8%
అసాధారణ వైద్యపరమైన లక్షణాలు,
ఇతర కారణాలతో 15.3%
- 0.4% మరణాలకు మధుమేహం కారణం.


 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.