close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శిరోముండనం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి

ఏపీ జీఏడీలో సహాయకార్యదర్శి జనార్దన్‌బాబుకు విచారణ బాధ్యత

సీతానగరం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఎస్సీ యువకుడు ప్రసాద్‌ శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ‘ఇసుక మాఫియాను ఎదురించినందుకు నాకు పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. ఇందుకు కారకులైన ముఖ్య వ్యక్తులను అరెస్టు చేయకపోవడంతో నేను మానసికంగా ఆవేదన చెందుతున్నాను. నక్సలైట్‌గా మారేందుకు అనుమతిస్తే నా గౌరవాన్ని రక్షించుకుంటా’ అని పేర్కొంటూ ఇటీవల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌కు వెబ్‌సైట్‌ ద్వారా బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ లేఖ పంపిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత దస్త్రాన్ని ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ చేసిందని, సహాయకార్యదర్శి జనార్దన్‌బాబుకు విచారణ బాధ్యతను అప్పగించిందని, ఈ కేసు విషయంలో ఆయనకు సహకరించాలని తనకు సూచించిందని బాధితుడు ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం వల్ల న్యాయం జరగకపోవడం వల్లనే లేఖ పంపించాను. తక్షణం రాష్ట్రపతి స్పందించడంతో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. సహాయకార్యదర్శి జనార్దన్‌బాబు గురువారం మునికూడలి వచ్చి నా దగ్గర నుంచి అవసరమైన వివరాలు తీసుకుంటారని వెలగపూడి కార్యాలయం నుంచి నాకు సమాచారం వచ్చింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు కొద్ది గంటల ముందే అట్రాసిటీ కేసులో భాగంగా రూ.50 వేల పరిహారాన్ని రెవెన్యూ అధికారులు హడావుడిగా వచ్చి అందించారు’ అని వివరించారు. వైకాపా నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ఆరోపించారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ మాట్లాడుతూ ఏ1 నుంచి ఏ6 వరకు ముద్దాయిలను వదిలేసి కొత్తగా విధుల్లో చేరిన పోలీసులపై చర్యలు తీసుకుని న్యాయం చేశామనడం సరికాదని చెప్పారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.