మీ ఫోన్ వాటర్‌ రెసిస్టెన్సో కాదో ఈ యాప్‌ చెబుతుంది!
close

Published : 09/07/2021 23:55 IST
మీ ఫోన్ వాటర్‌ రెసిస్టెన్సో కాదో ఈ యాప్‌ చెబుతుంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతో ముచ్చపడి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్‌కి కవర్‌, స్క్రీన్‌గార్డ్‌ అంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. మరి ఫోన్‌ నీళ్లలో పడిపోతే.. బయటికి తీసి ఆరబెడతాం. అదృష్టం బావుంటే ఫోన్ పనిచేస్తుంది.. లేదంటే సర్వీస్‌ సెంటర్‌కి తీసుకెళ్లాల్సిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే మొబైల్‌ తయారీ కంపెనీలు వాటర్ రెసిస్టెన్స్‌ ఫీచర్‌తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఐపీ రేటింగ్‌ ఉంటే ఆ ఫోన్‌ నీటిలో తడిసినా పాడవదు. కొనేముందు ఫోన్‌కి ఎంత ఐపీ రేటింగ్‌ ఉందో చెక్ చేసుకోవాలి. అయితే కంపెనీ చెబుతున్నట్టుగా నిజంగా ఫోన్‌కి వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఫోన్‌ని నీళ్లలో వెయ్యలేం. మరి ఏం చేయాలి? సరిగ్గా ఈ ఆలోచనతోనే రే డబ్ల్యూ అనే కంపెనీ వాటర్‌ రెసిస్టెన్స్‌ టెస్టర్‌ పేరుతో ఓ యాప్‌ను రూపొందించింది. దీని సాయంతో మన ఫోన్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ అవునో.. కాదో తెలుసుకోవచ్చు.

ఫోన్‌లో వాటర్ రెసిస్టెన్స్‌ టెస్టర్ యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్‌ని ఒకటి లేదా రెండు నిమిషాలు పక్కన ఉంచమని సూచిస్తుంది. తర్వాత మీ చేతి వేళ్లని స్క్రీన్ మీద ఉంచమని చూపిస్తుంది. చేతి వేళ్లు స్క్రీన్‌పై ఉంచి కొద్దిగా ఒత్తిడి పెట్టిన వెంటనే టెస్ట్ మొదలవుతుంది. స్క్రీన్‌ మీద గ్రీన్‌ మార్క్‌ కనిపిస్తే టెస్ట్ పూర్తయినట్లు. తర్వాత స్క్రీన్‌ మీద ఫోన్‌కి వాటర్ రెసిస్టెన్స్‌ ఉందా లేదా అనేది చూపిస్తుంది. అయితే ఫోన్‌లో సిమ్ ట్రే తీసి పరీక్షిస్తే ఫోన్ వాటర్ రెసిస్టెంట్ కాదని చూపిస్తున్నట్లు పలువురు యూజర్స్ వెల్లడిస్తున్నారు. ఈ యాప్‌ ఎంత కచ్చితత్వంతో పనిచేస్తుందనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న