ఎక్కువ డౌన్‌లోడ్లు టెలిగ్రాంకే..!
close

Published : 06/02/2021 20:34 IST
ఎక్కువ డౌన్‌లోడ్లు టెలిగ్రాంకే..!

వెల్లడిస్తున్న నివేదికలు

దిల్లీ: వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ తీసుకురావడం, దానిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రజలు ఇతర యాప్స్‌పై మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్‌లకు డిమాండ్‌ పెరిగింది. తాజాగా సెన్సార్‌ టవర్‌ అనే సంస్థ నివేదికలు విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌ ప్లేస్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ అయిన యాప్‌లలో టెలిగ్రాం మొదటిస్థానంలో ఉందన్నారు. యాపిల్‌ ప్లేస్టోర్‌లో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. మొత్తంగా టెలిగ్రాం 63మిలియన్ల డౌన్‌లోడ్‌లు అయ్యాయని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 3.8 రెట్లు పెరిగిందని వారు తెలిపారు. ఇది నాన్‌ గేమింగ్‌ యాప్స్‌లో మొదటిస్థానంలో ఉన్నట్లు వారు పేర్కొన్నారు.

టెలిగ్రాంను ఎక్కువగా ఇన్‌స్టాల్‌ చేసిన దేశాల్లో మొదటిస్థానంలో భారత్‌ (24శాతం) నిలువగా, తరువాత ఇండోనేసియా (10శాతం) ఉంది. టెలిగ్రాం తర్వాతి స్థానంలో టిక్‌టాక్‌ ఉందని తెలిపారు. భారత్‌లో నిషేధం ఉన్నప్పటికీ 62మిలియన్ల డౌన్‌లోడ్‌లతో రెండోస్థానంలో ఉందన్నారు. టిక్‌టాక్‌ను చైనాలో ఎక్కువగా ఇన్‌స్టాల్‌ చేసుకున్నారని తెలిపారు. టెలిగ్రాం డౌన్‌లోడ్‌లు భారీగా పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే వాట్సాప్‌ నుంచి టెలిగ్రాంకు చాట్‌ హిస్టరీ మార్చుకొనేందుకు కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఇవీ చదవండి..

ఇన్‌స్టాగ్రాంలో టిక్‌టాక్‌ తరహా ఫీచర్‌..

థర్డ్‌ పార్టీ సర్వీసులు అక్కర్లేదు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న