Samsung F22: 6K బ్యాటరీతో..బడ్జెట్‌ ధరలో
close

Published : 06/07/2021 17:30 IST
Samsung F22: 6K బ్యాటరీతో..బడ్జెట్‌ ధరలో

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం గెలాక్సీ ఏ22 మోడల్‌ తీసుకొచ్చిన శాంసంగ్... తాజాగా మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మెరుగైన ఫీచర్స్‌తో గెలాక్సీ ఎఫ్‌22 ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంతో విడుదలైన శాంసంగ్‌ బడ్జెట్ మోడల్స్‌తో పోలిస్తే ఎఫ్‌22లో కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్‌, డిస్‌ప్లే పరంగా కీలక మార్పులు చేశారు. మరి ఆ మార్పులు ఏంటీ..ఎఫ్‌22 ధరెంత..అమ్మకాలు ఎప్పటినుంచి ప్రారంభంకానున్నాయనేది చూద్దాం. 

గెలాక్సీ ఎఫ్22 ఫీచర్స్‌

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.4-అంగుళాల హెచ్‌డీ+ ఎస్‌అమోలెడ్ ఇన్ఫీనిటీ-యు డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనకవైపు 48ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, రెండు 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో 13ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్‌ యూఎస్‌బీ-సీ టైప్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 

గెలాక్సీ ఎఫ్‌22 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,499, 6జీబీ ర్యామ్/128జీబీ ధర రూ. 14,499. జులై 13 నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. డెనిమ్ బ్లూ, డెనిమ్‌ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న