Red flag emoji: ట్విటర్‌లో రెడ్‌ఫ్లాగ్స్‌ ఎందుకు వాడుతున్నారో తెలుసా?
close

Updated : 18/10/2021 11:56 IST

Red flag emoji: ట్విటర్‌లో రెడ్‌ఫ్లాగ్స్‌ ఎందుకు వాడుతున్నారో తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీరు ట్విటర్‌ వాడుతుంటే ఈ పాటికే ఎర్ర జెండాలు (రెడ్‌ఫ్లాగ్‌) ఎమోజీలు మీకు దర్శనమిచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఓ సారి ట్విటర్‌ను ఓపెన్‌ చేయండి. ఎప్పుడూలేని విధంగా వ్యక్తుల నుంచి కంపెనీల వరకు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తమ ట్వీట్లలో ఈ ఎర్రజెండాలను ఉపయోగించడాన్ని మీరు గమనిస్తారు. ఇంతకీ ఏమిటీ ఎర్రజెండాల కథ..? ఎక్కడ స్టార్ట్‌ అయ్యింది..?

ట్విటర్‌లో రెడ్‌ ఫ్లాగ్స్‌ వినియోగం ఎప్పటి నుంచో ఉన్నా ఈ మధ్యే దీని వాడకం ఎక్కువైంది. తొలుత అమెరికాలో ఈ ట్రెండ్‌ మొదలైంది. వ్యక్తిగత జీవితం, బంధాల గురించి ట్వీట్‌ చేస్తూ చేస్తున్నప్పుడు ఈ రెడ్‌ఫ్లాగ్‌లను వినియోగించడం మొదలైంది. డేటింగ్‌కు సంబంధించిన అంశాల చెబుతున్నప్పుడు వీటిని వినియోగించడంతో అవి ఎక్కువమంది దృష్టిని ఆకర్షించడం మొదలైంది. దీంతో అది కాస్తా ట్రెండ్‌గా మారడంతో అందరూ వినియోగించడం మొదలు పెట్టారు.

సాధారణంగా ఎర్ర జెండాలను హెచ్చరికకు గుర్తుగా వినియోగిస్తారు. వ్యక్తుల దృష్టిని ఆకర్షించడానికీ ఇవి ఉపయోగపడతాయి. రెడ్‌ ఫ్లాగ్స్‌ ట్రెండ్‌ మొదలయ్యాక నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెలిబుచ్చడం దగ్గర నుంచి సరదా సరదా ట్వీట్ల వరకు అన్నింటికీ వీటిని వినియోగించడం ప్రారంభమైంది. కేవలం గత వారం రోజుల్లోనే ట్విటర్‌లో ఈ జెండాల వినియోగం 455 శాతం పెరిగిందట. ఏదైనా ట్రెండ్‌ను అందిపుచ్చుకోవడంలో ముందుంటే పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ రెడ్‌ ఫ్లాగ్‌ ట్రెండ్‌ను అందుకుని ట్వీట్లు చేస్తున్నాయి. ట్విటర్‌, వాట్సాప్‌, లింక్డిన్‌, డామినోస్‌ పిజ్జా, కేఎఫ్‌సీ ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఈ రెడ్‌ ఫ్లాగ్‌లు ఉపయోగించి సరదాగా ట్వీట్లు చేశాయి.







Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న