Nokia New Phone: సింగిల్‌ ఛార్జ్‌తో..రెండు రోజుల బ్యాకప్‌
close

Published : 09/08/2021 21:22 IST
Nokia New Phone: సింగిల్‌ ఛార్జ్‌తో..రెండు రోజుల బ్యాకప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: గత నెలలో రెండు కొత్త నోకియా ఫోన్లను భారత విపణిలోకి తీసుకొచ్చిన హెచ్‌ఎండీ గ్లోబల్, తాజాగా మరో కొత్త ఫోన్ విడుదల చేసింది. ఎంట్రీ లెవల్ మార్కెట్‌ లక్ష్యంగా నోకియా సీ20 ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. డ్యూయల్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్స్‌తోపాటు..రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్ వంటి ఫీచర్స్ ఇస్తున్నట్లు నోకియా తెలిపింది. వీటితోపాటు ఇంకా ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం.

నోకియా సీ20 ప్లస్‌

ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆక్టాకోర్ యూనీసాక్‌ ఎస్‌సీ9863ఏ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇందులో మొత్తం మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 8ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2ఎంపీ డెప్త్‌ సెన్సర్ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,950 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఫోన్ రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని హెచ్‌ఎండీ గ్లోబల్ చెబుతోంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. 2జీబీ ర్యామ్‌/32జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌ ధర రూ. 8,999కాగా, 3జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ. 9,999. ఆగస్టు 9 నుంచి నోకియా వెబ్‌సైట్‌తోపాటు అన్ని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. బ్లూ, గ్రే రంగుల్లో నోకియా సీ20 ప్లస్ లభిస్తుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న