‘పాము కాటా? ఈ యాప్ ఎంతో ఉపయుక్తం‌!
close

Updated : 17/02/2021 13:45 IST
‘పాము కాటా? ఈ యాప్ ఎంతో ఉపయుక్తం‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాము కాటు ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏటా వేల సంఖ్యలో ప్రజలు పాముకాటుకు గురై చనిపోతున్నారు. ముఖ్యంగా కేరళలో అటవీ ప్రాంతం ఎక్కువ. తరచూ పాములు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పాములు ఆత్మరక్షణ కోసం మనుషుల్ని కాటు వేస్తుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇందుకు ఏ రకమైన పాము కాటు వేసిందో గుర్తించలేకపోవడం ఒక కారణమైతే.. పాము విషానికి విరుగుడు ఔషధం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండకపోవడం మరో కారణం. సమయానికి పాము రకం గుర్తింపు.. తగిన ఔషధం ఉన్నట్లయితే ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉండదు. అందుకే కేరళలో ఓ సంస్థ ‘స్నేక్‌ పీడియా(snakepedia)’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించింది. దీంతో పాము కాటు వేసినా గాబరా పడకుండా యాప్‌ ద్వారా పామును గుర్తించి, ఔషధమున్న ఆస్పత్రిని తెలుసుకొని నేరుగా అక్కడికి వెళ్లొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఈ యాప్‌లో దాదాపు 700 రకాలకుపైగా పాముల ఫొటోలు, వాటి లక్షణాలు, విషపూరితమా? కాదా?, ఏలాంటి పాము కరిస్తే ప్రథమ చికిత్స ఎలా చేయాలి?, ఏం చేయకూడదు ఇలా అన్ని వివరాలను పొందుపర్చారు. అంతేకాదు, పాములపై ఉన్న మూఢనమ్మకాలు, దుష్ప్రచారాలు నమ్మవద్దంటూ నిజానిజాలను ఈ యాప్‌లో వివరించారు. ఈ యాప్‌ ద్వారా పాము కాటు బాధితులు ఔషధాలు ఉన్న ఆస్పత్రుల వివరాలు తెలుసుకొని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్లొచ్చు. అలాగే వైద్యులు సైతం యాప్‌లో పామును గుర్తించి చికిత్స చేసే వీలుంటుంది.

ఈ యాప్‌ రూపకల్పనలో పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు భాగమయ్యారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోనే ఈ యాప్‌ అందుబాటులో ఉందని, ఇది కేవలం కేరళ రాష్ట్ర ప్రజలకే కాదు.. దేశవ్యాప్తంగా అందరికి ఉపయోగకరంగా ఉంటుందని యాప్‌ రూపకర్తలు చెబుతున్నారు. అయితే, గతంలోనే కేరళ రాష్ట్ర అటవీ శాఖ కూడా పాముల కోసం ఓ ప్రత్యేక యాప్‌ రూపొందించింది. పాములు, వాటి రకాల గురించి.. పాములు జనావాసాల్లోకి వస్తే ఫిర్యాదు చేయడానికి ఉపయుక్తంగా ఈ యాప్‌ ఉంటుంది. 

ఇవీ చదవండి..

కూతురు కోసం అమ్మ చేసిన యాప్‌

వినేద్దామా పుస్తకాలను..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న