త్వరలో మైక్రోమ్యాక్స్‌ 5జీ మొబైల్‌
close

Published : 26/02/2021 23:10 IST
త్వరలో మైక్రోమ్యాక్స్‌ 5జీ మొబైల్‌

దిల్లీ: ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన దేశీయ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది. సరికొత్త హంగులతో ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో 5జీ మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తామని ప్రకటించింది. ధర కూడా అందుబాటులోనే ఉంటుందని ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మ పేర్కొన్నారు. అలాగే ఇయర్‌ఫోన్స్‌ను కూడా (టీడబ్ల్యూస్‌ ఇయర్‌ బడ్స్‌) త్వరలో తీసుకొస్తామని వెల్లడించారు.

5జీ నెట్‌వర్క్‌పై ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారని, అందుకే 5జీ స్మా్ర్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు తమ కంపెనీ పనిచేస్తోందని రాహుల్‌ శర్మ తెలిపారు. ఏప్రిల్‌లో మైక్రోమ్యాక్స్‌ నుంచి మరో మొబైల్‌ రానుందన్నారు. ప్రసుత్తం నెలకు 2 మిలియన్ల స్మార్ట్‌ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నామని, ఈ సామర్థ్యాన్ని 3 మిలియన్లకు పెంచేలా తమ బృందం కృషి చేస్తోందని తెలిపారు. అలాగే అమ్మకాలు పెంచేలా వచ్చే వారం నుంచి 15 రాష్ట్రాల్లో 18 వేల మైక్రోమ్యాక్స్‌ రిటైల్‌ కౌంటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న