₹1 కే ఇయర్‌బడ్స్‌.. షరతులు వర్తిస్తాయ్‌
close

Updated : 23/06/2021 15:22 IST

₹1 కే ఇయర్‌బడ్స్‌.. షరతులు వర్తిస్తాయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్క రూపాయికి ఏమేమి వస్తాయో ఠక్కున చెప్పమంటే ఏం చెబుతారు..? చాక్లెట్‌, బిస్కట్‌ వంటివి చెప్తారు. అయితే, ఇయర్‌బడ్స్‌ కూడా రూపాయికే వస్తాయంటే నమ్ముతారా..? ఇయర్‌ బడ్స్‌ కనీస ధర ఎంత ఉండొచ్చు.. ఓ రూ.800 వేసుకోండి.. అయితే, లావా సంస్థకు చెందిన ఇయర్‌ బడ్స్‌ రేటు ఎంతో తెలుసా..? కేవలం రూపాయి.. అవును మీరు చదివింది కరెక్టే. కేవలం రూపాయికే ఇయర్‌బడ్స్‌ను లావా సంస్థ ‘ఆఫర్‌’ చేస్తోంది. రూపాయికే సొంతం చేసుకోవాలంటే 24వ తేదీ మధ్యాహ్నం వరకు ఆగాలి మరి. లావా ఈ-స్టోర్‌ కానీ, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లోగానీ గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ స్పెషల్‌ ఆఫర్‌ ప్రారంభవుతుంది. అయితే, ఇక్కడొక షరతు ఉందండోయ్‌.. స్టాక్‌ అందుబాటులో ఉన్నంత వరకే ‘రూపాయి’ ఆఫర్‌ వర్తిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.

వైర్‌లెస్‌ సెగ్మెంట్‌లోకి తన హవా చూపించడానికి లావా అడుగు పెట్టబోతోంది. ‘ప్రో బడ్స్‌’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. ఆఫర్‌లో భాగంగా కనీస ధరను రూ.1గా నిర్ణయించింది. అయితే, ఈ ఆఫర్‌ స్టాక్‌ అందుబాటులో ఉన్నంత వరకేనని లావా ప్రకటించింది. ప్రత్యేక ఆఫర్‌ ముగిసిన తర్వాత ‘ప్రో బడ్స్‌’ ధర రూ.2,199గా వెల్లడించింది. విద్యార్థులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు లావా చెబుతోంది.

ఫీచర్లు ఇవే... 

* 11.6 mm అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్స్‌ * మీడియా టెక్‌ ఎయిరో చిప్‌సెట్ * 25 గంటల మ్యూజిక్‌ ప్లేటైమ్ * 55 mAh బ్యాటరీ (ప్రతి బడ్‌), 500 mAh కేస్‌ బ్యాటరీ *  లేటెస్ట్‌ బ్లూటూత్‌ v5.0 * బరువు: 77 గ్రాములు 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న