ఐఫోన్‌లో కుకీస్‌..ఇలా చేస్తే సరి!
close

Published : 27/02/2021 15:17 IST

ఐఫోన్‌లో కుకీస్‌..ఇలా చేస్తే సరి!

ఇంటర్నెట్ డెస్క్‌: మీరు ఐఫోన్ వాడుతున్నారా..అందులో బ్రౌజర్‌ కుకీస్‌ని ఎప్పుడైనా డిలీట్ చేశారా. అందేంటీ ఎప్పటికప్పుడు బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేస్తున్నా కదా..మళ్లీ ఈ కుకీస్‌ గోలేంటీ అనుకోకండి. మీరు బ్రౌజర్‌లో కొత్త వెబ్‌సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారీ వెబ్‌ సర్వర్లు చిన్నపాటి మెసేజ్‌ను బ్రౌజర్‌కి పంపుతాయి. వాటిని ఫైల్‌ రూపంతో బ్రౌజర్ నిక్షిప్తం చేస్తుంది. వాటినే కుకీస్ అంటారు. ఇవి మీరు వెబ్‌ పేజీలో ఎలాంటి సమాచారం కోసం వెతుకుతున్నారనే సమాచారాన్ని ట్రాక్‌ చేస్తాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరం కానప్పటికీ, కొన్ని నెట్టింట్లో మీ యాక్టివిటీని ట్రాక్ చేసి మాల్‌వేర్‌/వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు కుకీస్‌ను డిలీట్ చేయాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. మీ ఐఫోన్‌లో సఫారీ, ఫైర్‌ఫాక్స్‌, గూగుల్ క్రోమ్‌, ఓపెరా టచ్‌, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ ఇలా ఏ బ్రౌజర్‌ వాడుతున్నా..అందులో కుకీస్‌ను డిలీట్ చెయ్యొచ్చు. అది ఎలానో చూద్దాం..


సఫారీ 

ఐఫోన్ యూజర్స్‌కి ఇన్‌బిల్ట్‌ యాప్‌గా సఫారీ బ్రౌజర్ ఉంటుంది. ఇందులో మీకు నచ్చినట్లుగా కుకీస్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఒకేసారి అన్నింటినీ లేదంటే ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చెయ్యొచ్చు. దీని కోసం ఐఫోన్ సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి అందులో సఫారీపై క్లిక్‌ చేయాలి. అందులో అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌పై క్లిక్‌పై చేస్తే వెబ్‌సైట్ డేటా ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే రిమూవ్ ఆల్ వెబ్‌సైట్ డేటా ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి రిమూవ్ నౌ అనే ఆప్షన్‌ని ఓకే చేస్తే మొత్తం కుకీస్‌ డిలీట్ అయిపోతాయి. ఒకవేళ కొన్నింటిని మాత్రమే డిలీట్‌ చేయాలనుకుంటే వెబ్‌సైట్ డేటాలో ఎడిట్‌పై క్లిక్ చేసి అవసరంలేని వాటిని డిలీట్ చేస్తే సరిపోతుంది.


గూగుల్ క్రోమ్‌

సఫారీ తర్వాత ఎక్కువ మంది యూజర్స్‌ ఉపయోగించేది గూగుల్ క్రోమ్‌. కుకీస్ డిలీట్ కోసం యాప్‌ ఓపెన్ చేసి మెనూలో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి క్లియర్ బ్రౌజింగ్ డేటాపై క్లిక్ చేయాలి. దానికి ముందు పూర్తి హిస్టరీ డిలీట్ చేయాలా లేక వారం రోజులు, గడిచిన 24 గంటల హిస్టరీ డిలీట్ చేయాలా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానితో పాటు కుకీస్‌, సైట్ డేటా ఆప్షన్లను కచ్చితంగా సెలెక్ట్ చేయాలి. తర్వాత క్లియర్ బ్రౌజింగ్ డేటా క్లిక్ చేస్తే బ్రౌజర్‌ నుంచి కుకీస్ డిలీట్ అయిపోతాయి.


ఫైర్‌ఫాక్స్‌

ఐఫోన్ ఫైర్‌ఫాక్స్‌ యాప్‌ ఓపెన్ చేసిన తర్వాత కుడి వైపు చివరన ఉన్న అడ్డగీతలపై క్లిక్ చేయాలి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా మేనేజ్‌మెంట్‌పై క్లిక్ చేయాలి. అందులో కుకీస్‌ సెలెక్ట్ చేశారా లేదా అనేది చెక్‌ చేసుకోవాలి. దానితో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచీ, డౌన్‌లోడ్ ఫైల్స్‌ వంటి వాటిని కూడా డిలీట్ చేయాలనుకుంటే వాటిని కూడా సెలెక్ట్ చేసి క్లియర్ ప్రైవేట్ డేటాపై క్లిక్ చేయాలి. తర్వాత ఓకే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కుకీస్‌తో పాటు మీరు ఎంపిక చేసిన ఆప్షన్స్‌కి సంబంధించిన వివరాలు డిలీట్ అవుతాయి.


ఓపెరా టచ్‌

ఓపెరా టచ్‌లో కుకీస్‌ను డిలీట్ చేయడం ఎంతో సులభం. యాప్‌లో కుడివైపు పై భాగంలో ఉన్న ‘ఓ’ అనే ఐకాన్‌పై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. దాన్ని ఓపెన్ చేసి క్లియర్ బ్రౌజింగ్ డేటాపై క్లిక్ చేస్తే ఇంకో విండో ఓపెన్ అవుతుంది. అందులో కుకీస్‌ అండ్ సైట్ డేటాపై టిక్‌ మార్క్ చేసి క్లియర్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే బ్రౌజర్ డేటా మొత్తం డిలీట్ అవుతుంది.


మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌

ఎడ్జ్‌ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పై భాగంలో మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌ ఓపెన్ చేయాలి. అందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేస్తే క్లియర్ బ్రౌజింగ్ డేటా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కుకీస్‌ అండ్ సైట్ డేటా సెలెక్ట్ చేయాలి. ఒకవేళ అది సెలెక్ట్ చేసుంటే కింద ఉన్న క్లియర్ బ్రౌజింగ్ డేటాపై క్లిక్ చేస్తే క్లియర్, క్యాన్సిల్ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో క్లియర్‌పై క్లిక్ చేస్తే కుకీస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇతర బ్రౌజర్లలానే కుకీస్‌తో పాటు బ్రౌజింగ్ హిస్టరీ, క్యాచీ, పాస్‌వర్డ్‌లను డిలీట్ చెయ్యొచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న