Smartphone Sales:  బడ్జెట్‌ ₹10 వేలా... అయితే ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి!
close

Published : 05/10/2021 01:43 IST

Smartphone Sales:  బడ్జెట్‌ ₹10 వేలా... అయితే ఈ మొబైల్స్‌పై ఓ లుక్కేయండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఇప్పుడు పండగ సేల్స్‌ నడుస్తున్నాయి. మొబైల్‌ కొందాం... అనుకొని ఆఫర్ల కోసం వేచి చూసిన వినియోగదారులు చాలామంది ఉండే ఉంటారు. మీరూ అలాంటి వారిలో ఒకరైతే... ఈ కథనం మీ కోసమే. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ , ₹10 వేలు ధర... అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ జాబితా రూపొందించాం. అందులో మీకు నచ్చిన మొబైల్‌ను ఎంచుకొని కొనేయండి. 


📲 రియల్‌మీ సీ21వైలో యూనిసాక్‌ టీ610 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుకవైపు మెయిన్‌ కెమెరా 13ఎంపీ ఇస్తున్నారు. 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటాయి. ఈ మొబైల్‌ ₹8,999కు అందుబాటులో ఉంది. ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, బ్యాంకు ఆఫర్లు పోను మొబైల్‌ ₹7,199కు అందుబాటులో ఉంటుంది.


📲 పోకో ఎం3 ప్రస్తుత ధర ₹9,999. బ్యాంకు ఆఫర్‌, ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ కలిపి ఈ మొబైల్‌ ₹8,999కి ఇస్తున్నారు. 6.53 హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఇస్తారు. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది.  6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 662 ప్రాసెసర్‌ ఇస్తారు.  


📲 రియల్‌మీ నార్జో 50ఐలో రెండు మోడళ్లు ఉన్నాయి. అన్నీ ఆఫర్లు కలుపుకొని ₹8,099 ధరకు వస్తోంది. ఇందులో  SC9863A ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 


📲 ఇన్ఫినిక్స్‌ హాట్‌ 11 మొబైల్‌ను ఆఫర్‌లు చూసుకుంటే ₹8,549కి పొందొచ్చు. మీడియాటెక్‌ హీలియో జీ70 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 13 ఎంపీ కెమెరా ఉంటుంది. 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తారు. 5,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.


📲 పోకో సీ31 ప్రస్తుత ధర ₹8,999. అయితే బ్యాంకు ఆఫర్‌ ₹900 తీసేస్తే... ₹8,099కే అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. 6.53 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌లో 13 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. 


📲  పది వేల రూపాయల లోపు ధరలో శాంసంగ్‌ ఫోన్‌ కావాలనుకుంటే ఉన్న ఆప్షన్లలో ఎఫ్‌ 12 ఒకటి.  శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 12 అన్ని ఆఫర్ల తర్వాత ₹8,549కి దొరుకుతుంది. 6.5 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఎగ్జినోస్‌ 850 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 


📲 పోకో  నుంచి ఎం2 రీలోడెడ్‌ పేరుతో మరో మొబైల్‌ అందుబాటులో ఉంది. ఇది ఆఫర్‌లో ₹8,099 ధరకే అందుబాటులో ఉంది.  మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుకవైపు 13 ఎంపీ మెయిన్‌ కెమెరా ఇస్తున్నారు. 6.53 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 


📲 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీతో ఒప్పొ ఏ53 మొబైల్‌ వస్తోంది. ఆఫర్ల తర్వాత చూస్తే ఈ మొబైల్‌ మీకు ₹9,891కి దొరుకుతుంది.  క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 6.5 ఇంచ్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఉంటుంది. వెనుకవైపు 13 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. 


📲 మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌తో మైక్రోమ్యాక్స్‌ నుంచి ఇన్‌ నోట్‌ 1 ఉంది. బ్యాంకు ఆఫర్లు పోను ₹8,549కే అందుబాటులో ఉంది. ఇందులో వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. 6.67 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. 


📲 మంచి కెమెరాతో మోటోరోలాలో ఓ మొబైల్‌ కావాలంటే మోటో జీ10 పవర్‌పై ఓలుక్కేయొచ్చు. అయితే ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 460 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ఆఫర్ల తర్వాత ఈ మొబైల్‌  ₹9,449కి దొరుకుతోంది. 


** పై మొబైల్స్‌ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉంటాయి. అందులో ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్‌ ఉంటుంది. దిగువ మొబైల్స్‌  అమెజాన్‌లో ఉంటాయి. ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై ఆఫర్ ఇస్తారు. **


📲 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌ కావాలి అంటే శాంసంగ్‌ ఎం 12 తీసుకోవచ్చు. ఇందులో  వెనుకవైపు 48 ఎంపీ మెయిన్‌ కెమెరా ఇస్తున్నారు. 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఎగ్జినోస్‌ 850 ప్రాసెసర్‌ ఉంటుంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. దీని ధర ₹8,550. 


📲 రూ. పది వేలలోపు ధరలో  128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న ఫోన్‌ కావాలంటే రియల్‌మీ నార్జో 50ఏ చూడొచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. 6,000 ఎంహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉటుంది. ఆఫర్లు పోను ₹9,899కి ఈ మొబైల్‌ అందుబాటులో ఉంది. 


📲 రెడ్‌మీ నుంచి పది వేల రూపాయల లోపు ధరలో ప్రస్తుత సేల్స్‌లో రెడ్‌మీ 9 ప్రైమ్‌ అందుబాటులో ఉంది. ఇందులో ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌  డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 13 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. 6.53 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ ప్లే ఉంటుంది. మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌, 5,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. సుమారు ₹9000 ధరలో మొబైల్‌ లభిస్తోంది. 


గమనిక: మొబైల్స్‌ ధరలు, ఆఫర్ల వివరాలు ఆయా ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లి ఓసారి చెక్‌ చేసుకోగలరు. కథనంలోని ధరలు, ఆఫర్లు వార్త రాస్తున్న సమయానికి ఉన్నవి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న