గూగుల్‌లో కొత్త ఫీచర్‌..
close

Published : 04/01/2021 23:58 IST
గూగుల్‌లో కొత్త ఫీచర్‌..

ఇంటర్నెట్‌ డెస్క్: గూగుల్‌ త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీని ద్వారా యూజర్స్‌ ఎక్కువ సమయం సెర్చ్‌ ఇంజిన్‌ పేజ్‌లో ఉండేలా చేయాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌లో ఉండే షార్ట్‌ వీడియోలను సెర్చ్‌ రిజల్ట్‌లో చూపించనుంది. ఇది సెర్చ్‌ రిజల్ట్‌లో కనిపించే వెబ్‌సైట్‌ల జాబితా పైన రొటేషన్‌ పద్ధతిలో కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ గూగుల్‌ యాప్‌లో పరీక్షల దశలో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో గూగుల్ డిస్కవరీలో ఇదే తరహా షార్ట్ వీడియోల ఫీచర్‌ ఉండేది. అయితే ప్రస్తుతం గూగుల్‌ తీసుకొస్తున్న షార్ట్‌ వీడియోలకు..రెండు నెలల క్రితం గూగుల్ సెర్చ్‌ యాప్‌లో విడుదల చేసిన గూగుల్ స్టోరీస్‌కు ఎలాంటి పోలిక లేదని తెలిపింది. ఇప్పటి వరకు గూగుల్ షార్ట్‌ వీడియోలను కేవలం యూట్యూబ్‌ , టాంగీ, ట్రెల్‌ల నుంచి మాత్రమే తీసుకునేవారు. తాజాగా ఇన్‌స్టాగ్రాం, టిక్‌టాక్‌ల షార్ట్‌ వీడియోలు కనిపించేలా చేయనున్నారు. అయితే ఈ వీడియోలపై క్లిక్‌ చేస్తే టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రాం యాప్‌లోకి కాకుండా వెబ్‌వెర్షన్‌లో ఓపెన్‌ అవుతాయి. దాని వల్ల యూజర్‌ ఒకేసారి రెండు యాప్‌లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందడని గూగుల్ భావిస్తోందట.  

ఇవీ చదవండి..

ఫౌజీ వచ్చేస్తున్నాడు..ఎప్పుడంటే..?

ఈ ఏడాది సందడి చేయనున్న స్మార్ట్‌ఫోన్లివే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న