Google Pixel 6: గూగుల్ కొత్త ఫోన్లు భారత్‌కి రావడంలేదు..ఎందుకంటే? 
close

Updated : 20/10/2021 17:28 IST

Google Pixel 6: గూగుల్ కొత్త ఫోన్లు భారత్‌కి రావడంలేదు..ఎందుకంటే? 

ఇంటర్నెట్‌డెస్క్‌: గూగుల్ కొత్త ఫోన్‌ పిక్సెల్‌ 6ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. వీటిలో తొలిసారి గూగుల్ సొంతగా అభివృద్ధి చేసిన టెన్సర్ ప్రాసెసర్లను ఉపయోగించింది. అలానే డిజైన్ పరంగా కూడా ఈ ఫోన్‌లో కీలక మార్పులు చేసింది. ఇతర పిక్సెల్ ఫోన్‌లకు భిన్నంగా పిక్సెల్‌ 6 సిరీస్‌లో వెనుకవైపు ఆకట్టుకునేలా డిజైన్‌తో ప్రత్యేకమైన బార్‌ను అమర్చింది. అందులో మూడు కెమెరాలను ఏర్పాటు చేసింది. అలానే ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌ను కూడా గూగుల్ కొత్త పిక్సెల్‌తో విడుదల చేసింది. పిక్సెల్‌ 6లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, పిక్సెల్‌ 6ప్రో మోడల్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చినట్లు గూగుల్ వెల్లడించింది.

అయితే ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయబోవడంలేదని గూగుల్ తెలిపింది. ఈ మేరకు గూగుల్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేసినట్లు భారత్‌కు చెందిన ప్రముఖ టెక్‌ వెబ్‌సైట్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతీయ మొబైల్‌ మార్కెట్‌ కాస్త భిన్నంగా ఉంటుందనే టెక్‌ నిపుణులు చెబుతున్న మాట. భారత్‌లో అమ్ముడయ్యే 90 శాతం ఫోన్లు రూ. 20వేల కన్నా తక్కువ ధరవేనని ఒక సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో పిక్సెల్‌ 6 ధర ఎక్కవగా ఉండటం..భారత మార్కెట్లో చైనా కంపెనీల హవా కొనసాగుతుండటంతో గూగుల్ కొత్త పిక్సెల్‌ ఫోన్‌ని భారత్‌కు తీసుకురావడంలేదని తెలిపింది. ఫీచర్స్ పరంగా కూడా పిక్సెల్‌ 6 మోడల్‌ భారతీయ వినయోగదారులను ఆకర్షించకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ప్రీమియం కేటగిరిలో యాపిల్‌, శాంసంగ్‌ మార్కెట్‌లకు గూగుల్ పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. గతంలో గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో పిక్సెల్ 4ఏ మోడల్‌ను మాత్రమే భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత వచ్చిన పిక్సెల్‌ 4 ఎక్స్‌ఎల్‌, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్‌ 5 మోడల్స్‌ని భారత్‌లో విడుదల చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో పిక్సెల్‌ 6 మోడల్‌ ధర 599 డాలర్లు (సుమారు రూ. 44,900), పిక్సెల్‌ 6ప్రో ధర 899 డాలర్లు (సుమారు రూ. 67,400). ఈ నేపథ్యంలో అధిక ధర కలిగిన కొత్త పిక్సెల్‌ ఫోన్లకు భారత్‌లో పెద్దగా డిమాండ్ ఉండపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న