ఆ ‘తరంగాల’ జాడలు..
close

Updated : 24/02/2021 16:57 IST

ఆ ‘తరంగాల’ జాడలు..

విశాల విశ్వంలో అంతుచిక్కని చిక్కు ప్రశ్నలెన్నో. శతాబ్దాలుగా శాస్త్రవేత్తల ప్రతిపాదనలు.. విశ్లేషణలు ఎన్నో. వాటిల్లో 1916లో ఐన్‌స్టీన్‌ చేసిన ప్రతిసాదన ఒకటి ‘గురుత్వ తరంగాలు’. తగినంత ద్రవ్యరాశి గల వస్తువులు వేగ మార్పిడితో కదులుతుంటే అవి స్పేస్‌, టైమ్‌ పరిధుల్లో గురుత్వ తరంగాల్ని ఏర్పరుస్తాయని ప్రతిపాదించాడు. ఆ తర్వాత అటువంటి తరంగాలు ఉంటాయా అని సందేహపడ్డారు చాలామంది. ఏది ఏమైనా ఇది ఒక రకంగా సాపేక్ష సిద్ధాంతాన్ని సమర్థించగల ఒక గొప్ప ప్రామాణిక ఆధారం. అనేక దశాబ్దాల తరబడి వీటిని గుర్తించే ప్రయత్నాలు పరిశోధకులు చేస్తూనే ఉన్నారు. ఈ తరంగాలు ఒక నిలకడ నీటిలో ఏర్పడే కెరటాల మాదిరి ఉంటాయని భావించారు. 1970ల్లో వీటి ఉనికిని తెలిపే సంకేతాలు శాస్త్రవేత్తలకు దొరికినప్పటికీ సరైన అవగాహనకి రాలేకపోయారు. చివరికి 2015లో వీటిని సూటిగా గుర్తించగలిగారు. అమెరికా నిర్మిత అబ్జర్వేటరీలో శాస్త్రవేత్తలు సుదూర ప్రాంతాల్లో ఉండే రెండు కృష్ణ బిలాలు ఢీకొనడం వల్ల గురుత్వ తరంగాల ఉనికిని గుర్తించినట్టు ప్రకటించారు. దీంతో విశ్వానికి సంబంధించిన కొత్త కొత్త మార్గాలు అన్వేషించడానికి దారులు తెరుచుకున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధకులు, ఖగోళ శాస్త్రవేత్తల చూపు గురుత్వ తరంగాలపైనే ఉంది అనడంలో సందేహం లేదు. విశ్వ రహస్యాల్ని ఛేదించడంలో వీటి పాత్ర కీలకమే!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న