ఇదో స్మార్ట్ పర్సు
close

Updated : 24/02/2021 17:47 IST

ఇదో స్మార్ట్ పర్సు

అన్నింటికీ ప్రైవసీని కోరుకునే మనం నిత్యం జేబులో ఉండే పర్సు విషయంలో ఎందుకు స్మార్ట్‌గా ఆలోచించడం లేదు. రెండు మూడు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, డబ్బు, ఇతర ముఖ్యమైన కార్డులు భద్రం చేసే పర్సుని సురక్షితంగా వాడుకునేందుకు ‘క్యాష్యూ స్మార్ట్‌ వాలెట్‌’ని వాడొచ్చు. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే.. స్మార్ట్‌ ఫోన్‌ని అన్‌లాక్‌ చేసినట్టుగానే ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌తో తెరవచ్చు. ఎవరుపడితే వాళ్లు పర్సుని తెరచి చూడ్డం కుదరదు. అంతేకాదు.. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో ఫోన్‌కి కనెక్ట్‌ అవుతుంది. మీరెప్పుడైనా పర్సుని వదిలేసి వెళ్తున్నట్లయితే వెంటనే అలర్ట్‌ చేస్తుంది. అలాగే.. ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోతే అలారం మోగించి కనిపెట్టొచ్చు. ప్రత్యేక యాప్‌ సపోర్టుతో పర్సు లోకేషన్‌ని ట్రాక్‌ చేయొచ్చు కూడా.

* ధర రూ.11,999


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న