మ్యాక్‌బుక్‌కి అదనం
close

Updated : 24/02/2021 16:42 IST

మ్యాక్‌బుక్‌కి అదనం

యాపిల్‌ కార్నర్‌

సాఫ్ట్‌వేర్‌ లేదా వ్యాపార రంగాల్లో ఎక్కువగా వాడుతున్నది యాపిల్‌ మ్యాక్‌బుక్‌నే. సామర్థ్యంలోగానీ.. డిజైన్‌ పరంగానైనా నెంబర్‌ వన్‌ అనే చెప్పుకోవచ్చు. అంతలా టెక్నాలజీ ప్రియుల మనసు దోచుకున్న మ్యాక్‌బుక్‌ని ఈ అదనపు గ్యాడ్జెట్‌లతో మరింత సౌకర్యంగా వాడుకోవచ్చు. అవేంటంటే..
Angelbird USB Type-Chub ఇప్పుడొస్తున్న సరికొత్త మ్యాక్‌బుక్‌ల్లో యూఎస్‌బీ టైప్‌-ఏ, హెచ్‌డీఎంఐ.. లాంటి ఇతర పోర్టులు కనిపించడం లేదు. టైప్‌-సీ పోర్టులు మాత్రమే కనిపిస్తాయ్‌. అలాంటప్పుడు ‘టైప్‌-సీ హబ్‌’ని వాడుకోవచ్చు. దీంట్లో మూడు యూఎస్‌బీ 3.2, రెండు యూఎస్‌బీ 2.0, కార్డు రీడర్‌, హెచ్‌డీఎంఐతో పాటు ఇతర పోర్టులు ఉన్నాయి. అవసరం అయినప్పడు దేన్నయినా వాడుకుని మ్యాక్‌బుక్‌కి అనుసంధానం అవ్వొచ్చు.


Samsung T7 portable SSD. ఎక్కువ ఇంటర్నెట్‌ మెమరీతో కూడిన మ్యాక్‌బుక్‌ కావాలంటే ఖరీదు ఎక్కువే. అలాంటప్పుడు ఈ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ డ్రైవ్‌ని వాడుకోవచ్చు. ఇదో పోర్టబుల్‌ స్టోరేజ్‌ స్థావరం. 500జీబీ, 1టీబీ, 2టీబీల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. పీసీలతో పాటు ఫోన్‌లకూ కనెక్ట్‌ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.
RAVPower PD Pioneer పోర్టబుల్‌ ఛార్జర్‌. మ్యాక్‌బుక్‌కి బ్యాటరీ సామర్థ్యం ఎక్కువే అయినా.. వెంట ఛార్జర్‌ ఉండడం మంచిదే. అందుకే ఈ 20,000 ఎంఏహెచ్‌ పవర్‌బ్యాంక్‌. 45వాట్‌ సామర్థ్యంతో బుక్‌ని ఛార్జ్‌ చేయొచ్చు. ఫోన్‌ 15వాట్‌తో ఛార్జ్‌ అవుతుంది. బుక్‌తో పాటు టైప్‌-సీ కేబుల్‌ వస్తుంది. ఒకవేళ అది పోయినా.. పని చేయకపోయినా AMX PD Type-C to Type-C కేబుల్‌ని ప్రయత్నించొచ్చు. ఛార్జింగ్‌, డేటా ట్రాన్స్‌ఫర్‌కి చక్కగా ఉపయోగపడుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న