నొప్పిని తగ్గించే ఎలక్ట్రోడ్లు!
close

Updated : 20/10/2021 06:09 IST

నొప్పిని తగ్గించే ఎలక్ట్రోడ్లు!

వి అతి పలుచని ఎలక్ట్రోడ్లు. ఎటంటే అటు వంగుతాయి. నొప్పినీ తగ్గిస్తాయి. విచిత్రంగా అనిపించినా స్వీడన్‌లోని లుండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇలాంటి కొత్త స్టిమ్యులేషన్‌ పద్ధతినే రూపొందించారు. దుష్ప్రభావాలేవీ లేకుండానే నొప్పి నుంచి ఉపశమనం పొందటానికిది వీలు కల్పిస్తుంది. విడవకుండా వేధించే నొప్పులకు మందులు వేసుకోవటమే ప్రధాన చికిత్స. వీటితో ఉపశమనం కలిగినప్పటికీ జ్ఞానేంద్రియాలు, మెదడు వంటివీ ప్రభావితమవుతాయి. ఇలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్సల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ దిశగా లుండ్‌ యూనివర్సిటీ ప్రయత్నం కొత్త ఆశలు రేపుతోంది. అతి సున్నితమైన, మృదువైన ఎలక్ట్రోడ్లను మెదడులో అమర్చటం దీనిలోని కీలకాంశం. ఇవి దుష్ప్రభావాలను కలిగించే నాడీ కణాల సర్క్యూట్లను ఉత్తేజితం చేయకుండా నొప్పిని నియంత్రించే భాగాలనే ప్రేరేపితం చేస్తాయి. ఇలా నొప్పిని సూచించే సంకేతాలు మెదడుకు అందకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నొప్పి భావన కలగదు. ఎలుకల్లో ఇది మంచి ప్రభావం కనబరచినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన మెదడులోనూ ఇలాంటి నియంత్రిత వ్యవస్థలే ఉంటాయి కాబట్టి ఇది మనుషుల్లోనూ సమర్థంగా పనిచేయగలదని భావిస్తున్నారు. ఒక్క నొప్పులకే కాదు.. మెదడులోని అన్ని భాగాల సమస్యలకు అనుగుణంగా దీన్ని మార్చుకునే వీలుంది. అందువల్ల పార్కిన్సన్స్‌, కుంగుబాటు, మూర్చ, పక్షవాతం వంటి జబ్బులకూ దీన్ని వాడుకునే వెసులుబాటు ఉంటుందనీ పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న