సామ్‌సంగ్‌  కొత్త మడత ఫోన్లు
close

Updated : 21/07/2021 05:08 IST
సామ్‌సంగ్‌  కొత్త మడత ఫోన్లు

సామ్‌సంగ్‌ ఆగస్టులో మరో మూడు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేయనుంది. వీటి పేర్లు గెలాక్సీ జెడ్‌  ఫోల్డ్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3, గెలాక్సీ జెడ్‌ ఫ్లిఫ్‌ 3 లైట్‌. ఫోల్డ్‌ 2 కన్నా గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 3 మరింత పలుచగా, తేలికగా ఉంటుందని లీకైన దృశ్యాలు, వివరాలను బట్టి తెలుస్తోంది. మడత పెట్టినప్పుడు దీని మందం 14.5 మి.మీ. ఉంటుంది. కెమెరా బంప్‌తో కలిపితే 15.6 మి.మీ. మందం అవుతుంది. తెరచినప్పుడు కేవలం 6.6 మి.మీ. మందంతోనే కనిపిస్తుంది. కెమెరా బంప్‌తో చూసినా 7.7 మి.మీ. మాత్రమే. సెల్ఫీ కెమెరా కనిపించకపోవటం విశేషం. అంటే పూర్తిగా కనిపించదని కాదు. అంత స్పష్టంగా కనిపించదు. పలుచటి పొర కప్పేసి ఉండటం వల్ల హోల్‌-పంచ్‌ డిజైన్‌ మాదిరిగా కనిపిస్తుంది. ఎస్‌ పెన్‌ సపోర్టు, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఇతర ప్రత్యేకతలు. ఫ్లిప్‌ 3 కన్నా ఫ్లిప్‌ 3 లైట్‌ ధర తక్కువగా ఉండొచ్చు. ఫ్లిప్‌ 3 కవర్‌ డిస్‌ప్లే 1.1 అంగుళాల నుంచి 1.9 అంగుళాల మేరకు పెరిగే అవకాశముంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న