మాటతోనే మెయిల్‌ రాత
close

Updated : 16/06/2021 08:17 IST

మాటతోనే మెయిల్‌ రాత

మాటలను టెక్ట్స్‌ రూపంలోకి మార్చే యాప్స్‌ గురించి తెలిసిందే. మరి ఇలాంటి ఈమెయిల్‌ను చూశారా? అయితే కొత్త అవుట్‌లుక్‌ మొబైల్‌ యాప్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం  మైక్రోసాఫ్ట్‌ సంస్థ కోర్టానా ఎనేబుల్డ్‌ వాయిస్‌ సదుపాయాన్ని కల్పించింది. దీంతో మాటలతోనే ఈమెయిల్‌ రాసుకోవచ్చు. సమావేశాల తేదీల క్రమాన్ని రాసుకోవచ్చు. వీటిని నోటి మాటతోనే సెర్చ్‌ చేసుకోవచ్చు కూడా. ముందుగా ఈ సదుపాయం ఐఓఎస్‌ పరికరాలకు అందుబాటులోకి రానుంది. దీన్ని వాడుకోవటానికి ముందుగా కొత్త అవుట్‌లుక్‌ మొబైల్‌ యాప్‌లో వాయిస్‌ మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ సమావేశాలను తేలికగా నిర్వహించుకోవటానికి మైక్రోసాఫ్ట్‌ కొత్తగా షెడ్యూలర్‌ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది. ఇది మనం రాసిన విషయాలను అర్థం చేసుకోగలదు. అందువల్ల కోర్టానా ద్వారా మాటలను గ్రహించి, అవసరమైన పనులు చేసిపెడుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న