StartlsBack: విండోస్‌ 11 స్టార్ట్‌ మెనూకి ఇది ప్రత్యామ్నాయం..కానీ
close

Published : 08/09/2021 23:40 IST

StartlsBack: విండోస్‌ 11 స్టార్ట్‌ మెనూకి ఇది ప్రత్యామ్నాయం..కానీ

ఇంటర్నెట్‌డెస్క్‌: అక్టోబరు 5న విండోస్‌ 11ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అంతకుముందే బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. దీంతో విండోస్‌ 11లోని కొత్త ఫీచర్స్‌, అప్‌డేట్‌లకు సంబంధించిన వివరాలు నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఆండ్రాయిడ్ యాప్స్‌ సపోర్ట్‌తో పాటు విండోస్‌ 11లో స్టార్ట్ మెనూను ఎడమవైపు నుంచి మధ్యలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే స్టార్ట్ మెనూ మార్పుపై యూజర్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం స్టార్‌డాక్‌ అనే కంపెనీ విండోస్‌ 11కి ప్రత్యామ్నాయంగా స్టార్ట్‌11 అనే కొత్త స్టార్ట్ మెనూని రూపొందించినట్లు వెల్లడించింది. తాజాగా కొంతమంది డెవలపర్స్ విండోస్ 11 స్టార్ట్‌ మెనూకి బదులు స్టార్ట్‌ల్స్‌బ్యాక్‌ అనే మరో స్టార్ట్ మెనూని రూపొందించినట్లు తెలిపారు. దీంతో స్టార్ట్‌ల్స్‌బ్యాక్‌లోని ఫీచర్స్‌ గురించి నెటిజన్లలో చర్చ మొదలైంది. మరి స్టార్ట్‌ల్స్‌బ్యాక్‌ గురించిన వివరాలు తెలుసుకుందామా..  

స్టార్ట్‌ల్స్‌బ్యాక్‌ స్టార్ట్ మెనూని విండోస్ 11 యూజర్స్ ఎవరైనా ప్రయత్నించొచ్చు. ఇందులో కూడా విండోస్‌ స్టార్ట్‌ మెనూలో మాదిరి అన్ని రకాలా ఫీచర్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా విండోస్‌ 7లోని స్టార్ట్ మెనూలానే ఇది పనిచేస్తుంది. అలానే యూజర్స్‌ తమకి నచ్చినట్లుగా ఈ మెనూలో మార్పులు చేసుకోవచ్చు. విండోస్‌ 11లో మాదిరిగా దీన్ని స్క్రీన్‌ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది కస్టమ్‌ టెక్చర్స్‌, ట్రాన్సపరెన్సీ సెట్టింగ్స్‌, బ్లర్ ఎఫెక్ట్స్‌ వంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్‌ 11లోని స్టార్ట్ మెనూ, టాస్క్‌బార్‌లతో పోలిస్తే స్టార్ట్‌ల్స్‌బ్యాక్‌ స్టార్ట్ మెనూ సిస్టం రీసోర్సులను తక్కువగా ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ట్ మెనూ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. నవంబరు వరకు దీన్ని యూజర్స్ ఎవరైనా ఉచితంగా ప్రయత్నించొచ్చు. తర్వాత ఈ మెనూను ఉపయోగించుకోవాలంటే మాత్రం లైసెన్స్ కొనుగోలు చేయాల్సిందే. అయితే ఈ స్టార్ట్‌ మెనూ మైక్రోసాఫ్ట్ ఇన్‌సైడర్‌ ప్రోగ్రాంలో భాగంగా విండోస్‌ 11 బీటా డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్న యూజర్స్‌కి కాదట. అక్టోబరు 5 తర్వాత విండోస్‌ 11 ఉపయోగించనున్న యూజర్స్‌ని దృష్టిలో ఉంచుకొని రూపొందిచినట్లు డెవలపర్స్‌ తెలిపారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న