Apple: యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!
close

Updated : 22/10/2021 23:45 IST

Apple: యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌.. ధర తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ సంస్థ తయారు చేసే కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్‌, వాచీ.. ఇలా వస్తువు ఏదైనా ఖరీదు చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కున్న ఇమేజ్‌ వల్ల ఎంత ఖరీదైనా వీటిని కొనేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇప్పుడు యాపిల్‌ సంస్థ తమ వినియోగదారుల కోసం యాపిల్‌ వస్తువులను శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన యాపిల్‌ పాలిషింగ్‌ క్లాత్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే, దాని ధర చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

సాధారణంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులను శుభ్రం చేయడానికి ఇంట్లో ఉండే ఏదైనా మెత్తటి వస్త్రాన్ని ఉపయోగిస్తాం. లేదా మార్కెట్లో ఇందుకోసం ప్రత్యేకించి పాలిషింగ్‌ వస్త్రాలు లభిస్తాయి. వాటి ధర పదో, యాభయ్యో ఉంటుంది. మహా అయితే ఏ వంద రూపాయలకో దొరుకుతుంది. కానీ, యాపిల్‌ సంస్థ తీసుకొచ్చిన ఈ పాలిషింగ్‌ క్లాత్‌ ధర అక్షరాలా రూ.1900. అంత మొత్తం ఒకేసారి చెల్లించలేని వారి కోసం ఈఎంఐ సదుపాయం (రూ.224/నెలకు) కూడా కల్పిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ క్లాత్‌ను ఇప్పుడు ఆర్డర్‌ చేస్తే డెలివరీ చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందట. అయినా చాలా మంది ఈ పాలిషింగ్‌ క్లాత్‌ కోసం ఆర్డర్‌ చేస్తుండటం మరింత విడ్డూరం. ఈ క్లాత్‌తో యాపిల్‌ బ్రాండ్‌లో ఏయే వస్తువులను శుభ్రం చేయొచ్చో తెలిపే ఓ జాబితాను కూడా యాపిల్‌ సంస్థ పొందుపర్చింది. ప్రస్తుతం ఈ యాపిల్‌ క్లాత్‌.. సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీని ధర చూసి టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ సహా అనేక మంది ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న