Amazon Prime: ₹500కే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌!
close

Updated : 01/06/2021 19:00 IST

Amazon Prime: ₹500కే ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూత్‌ను ఆకట్టుకోవడానికి మరో కొత్త ఆఫర్‌తో ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ముందుకొచ్చింది. కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే 18-24 మధ్య ఉన్న వయసు గల వారికి 50 శాతం రాయితీ అందిస్తోంది. ఏడాది, మూడు నెలల సబ్‌స్క్రిప్షన్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇంతకీ ఈ ఆఫర్‌ ఎలా పొందాలంటే..?

ప్రైమ్‌ వీడియో, మ్యూజిక్‌, ఫ్రీ డెలివరీ వంటి సదుపాయాల పొందేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు ఏడాదికి ₹999 చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలల కాలానికి ₹329 చెల్లించాలి. యూత్‌ ఆఫర్‌ కింద దీన్ని సగం ధరకే పొందాలంటే యూజర్‌.. ఆధార్‌/పాన్‌/ ఓటర్‌ ఐడీ/ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వాటిల్లో ఏదైనా గుర్తింపు కార్డును అప్‌లోడ్‌చేయాల్సి ఉంటుంది. సెల్ఫీని కూడా పంపించాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్‌ పూర్తయ్యాక 48 గంటల్లోపు ₹500 క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ పే బ్యాలెన్స్‌ కింద ఖాతాలో జమ అవుతుంది. అదే మూడు నెలల ప్లాన్‌ తీసుకునే వారికి ₹165 వస్తుంది. దీన్ని రీఛార్జులు, అమెజాన్‌లో ఇతర కొనుగోళ్లకు వినియోగించుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్‌ కేవలం ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా మొబైల్‌ యాప్‌/ బ్రౌజర్‌లో యాక్టివేట్‌ చేసుకున్న వారికి మాత్రమేనని అమెజాన్‌ పేర్కొంది. డెస్క్‌టాప్‌ లేదా ఐవోఎస్‌ యాప్‌ వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తించదు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న