Amazon TV Fire Stick: 4కే రిజల్యూషన్‌ స్ట్రీమింగ్‌తో అమెజాన్‌ కొత్త టీవీ ఫైర్‌ స్టిక్‌ 
close

Published : 11/09/2021 14:29 IST

Amazon TV Fire Stick: 4కే రిజల్యూషన్‌ స్ట్రీమింగ్‌తో అమెజాన్‌ కొత్త టీవీ ఫైర్‌ స్టిక్‌ 

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెజాన్‌ స్ట్రీమింగ్ మీడియా సేవల విభాగంలోకి మరో కొత్త టీవీ ఫైర్‌ స్టిక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. అమెజాన్ ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కే మాక్స్‌ పేరుతో ఈ డివైజ్‌ను పరిచయం చేసింది. దీని సాయంతో యూజర్స్ 4కే రిజల్యూషన్ వీడియోలను ఆస్వాదించగలుగుతారని తెలిపింది. ఇప్పటి వరకు విడుదల చేసిన ఫైర్‌ స్టిక్‌లలో ఇదే అత్యుత్తమమైనదని అమెజాన్ పేర్కొంది. సాధారణ ఫైర్‌ స్టిక్‌ కంటే ఇది 40 శాతం అధిక సామర్థ్యంతో పనిచేస్తుందని తెలిపింది.

ఇందులో క్వాడ్‌కోర్ మీడియాటెక్‌ ఎమ్‌టీ8696 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఐఎమ్‌జీ జీఈ8300 గ్రాఫిక్‌ కార్డ్‌ ఉంది. వైఫై 6 కనెక్టివిటీ ఫీచర్ ఇస్తున్నారు. ఇది వీడియోలు ప్లే అయ్యేప్పుడు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన నెట్‌వర్క్‌ను అందిస్తుందని అమెజాన్‌ తెలిపింది. బ్లూటూత్‌ 5.0ను సపోర్ట్ చేస్తుంది. దీంతో బ్లూటూత్ స్పీకర్స్‌, హెడ్‌ఫోన్స్, వీడియో గేమ్‌ కంట్రోలర్స్‌తో సులువుగా అనుసంధానించుకోవచ్చు. అలానే ఈ ఫైర్‌స్టిక్ డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌ 10, హెచ్‌డీఆర్‌ 10+ ఫార్మాట్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫైర్‌స్టిక్‌ ద్వారా టీవీలో వీడియోలను ఆస్వాదిస్తూనే సెక్యూరిటీ కెమెరాల వీడియోను పిక్చర్‌-ఇన్‌-పిక్చర్ ఫీచర్‌తో చూడొచ్చు. ‘‘భారత్‌లో ఉన్న కోట్లాది మంది ఫైర్‌ టీవీ యూజర్స్‌ కొత్త ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కే మాక్స్‌ ద్వారా మా కంటెంట్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా వేగవంతమైన కనెక్టివిటీతో ఆస్వాదించగలుగుతారు’’ అని అమెజాన్‌ డివైజెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా తెలిపారు. ఈ ఫైర్‌ స్టిక్‌ ధర రూ. 6,499గా అమెజాన్ నిర్ణయించింది. అక్టోబరు 7 నుంచి అమెజాన్‌లో ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కే మాక్స్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న