వాట్సాప్‌ బగ్స్‌ అన్నీ ఒక దగ్గర... 
close

Updated : 04/09/2020 17:07 IST

వాట్సాప్‌ బగ్స్‌ అన్నీ ఒక దగ్గర... 

వెబ్‌ పేజీ సిద్ధం చేసిన వాట్సాప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సైబర్‌ సెక్యూరిటీ సంబంధించి వరుస ఆరోపణలు వస్తుండటంతో... కట్టడి దిశగా వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా యాప్‌ భద్రత, దానికి సంబంధించి చేసే మార్పులు, బగ్‌ ఫిక్స్‌ వంటి సమాచారాన్ని యూజర్లకు తెలియజేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. ‘‘యాప్‌ స్టోర్ల విధివిధానాల కారణంగా ప్రతిసారీ భద్రతాపరమైన సూచనలతో వివరాలు యూజర్లకు ఇవ్వలేకపోతున్నాం. కొత్తగా తీసుకొచ్చిన అడ్వయిజరీ పేజ్‌ (వెబ్‌సైట్) ద్వారా యాప్‌ భద్రత, బగ్ ఫిక్సెస్‌కు సంబంధించిన సమాచారం తెలియజేస్తాం’’ అని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

యూజర్ల సైబర్‌ సెక్యూరిటీ విషయంలో  మరింత పారదర్శకంగా వ్యవహరించేందుకు ఈ వెబ్‌సైట్‌ (వెబ్‌ పేజ్‌) దోహదపడుతుందని కంపెనీ పేర్కొంది. యాప్‌లో లోపాన్ని గుర్తించిన వెంటనే టెక్నికల్‌ టీమ్‌ దానిని సరిచేస్తుందని, అలా యూజర్స్‌కి అత్యుత్తమ భద్రతతో అత్యుత్తమ సేవలను అందిస్తుందని వాట్సాప్‌ వెల్లడించింది. మరోవైపు యూజర్స్‌ కూడా యాప్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దాని వల్ల యాప్‌ భద్రత, పనితీరు మరింత మెరుగవుతాయని కంపెనీ తెలిపింది. ఇటీవల వీడియో, ఆడియో కాల్స్‌కి సబంధించిన లోపాన్ని వాట్సాప్‌ సరిచేసింది. గతంలో హ్యాకర్స్‌ దీని ద్వారా మాల్‌వేర్‌ను యాప్‌లోకి పంపడంతో.. మానవ హక్కుల కార్యకర్తకలు, జర్నలిస్టులకు సంబంధించిన 1,400 డివైజ్‌లు హ్యాకింగ్‌కి గురయ్యాయి. ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా వాట్సాప్‌ ఈ కొత్త వెబ్‌సైట్/వెబ్‌పేజ్‌ ద్వారా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయనుంది.

వాట్సాప్‌లో సరి చేసిన బగ్స్‌/సమస్యల వివరాలు కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న