టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయాలు ఇవిగో..
close

Updated : 16/10/2020 15:40 IST
టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయాలు ఇవిగో..

ఇంటర్నెట్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసి మూడు నెలలు అయింది. భారత్‌లో ఎంతో పాపులర్‌ అయిన ఈ యాప్‌ చైనా ప్రభుత్వం కోసం డేటా సేకరిస్తుందనే ఆరోపణలతో బ్యాన్‌ చేశారు. ఈ చర్యతో టిక్‌టాక్‌ యాజమాన్యం సహా యూజర్స్‌ ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు. టిక్‌టాక్‌ అందుబాటులో లేకపోవడంతో వీడియోలు రూపొందించేందుకు అలవాటు పడిన యూజర్స్‌ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. టిక్‌టాక్‌ ఫీచర్స్‌తో ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఇతర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. దానితో పాటు పలు స్టార్టప్‌లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిక్‌టాక్‌ ప్రత్యామ్నాయంగా షార్ట్ వీడియో యాప్‌లను రూపొందించాయి. ఫేస్‌బుక్‌, యుట్యూబ్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు సైతం యూజర్స్‌ని ఆకట్టుకునేందుకు షార్ట్‌ వీడియో ఫీచర్‌ను పరిచయం చేశాయి. మరి టిక్‌టాక్‌ తరహా ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాప్స్‌ జాబితా మీ కోసం..


చింగారీ (Chingari)

టిక్‌టాక్‌కు ప్రత్యమ్నాయంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిందే చింగారీ యాప్‌. తక్కువ కాలంలో ఎంతో పాపులర్ అయిన ఈ యాప్‌ను ఇప్పటి వరకు సుమారు 3కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది 18-35 ఏళ్ల వయస్సువారే. ఇంగ్లీష్‌, స్పానిష్‌తో పాటు హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళ్‌, ఒడియా, తెలుగు భాషల్లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే దీన్ని మరిన్ని భారతీయ భాషల్లోకి తీసుకొస్తామని యాప్‌ రూపకర్తలు తెలిపారు.


ఇన్‌స్టాగ్రాం రీల్స్‌ (Instagram Reels)

ఫొటో షేరింగ్ యాప్‌గా ఎంతో పాపులర్‌ అయిన ఇన్‌స్టాగ్రాంలో షార్ట్‌ వీడియోల కోసం రీల్స్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇందులో 15 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. ఆడియో స్పీడ్‌ను పెంచడం/తగ్గించడం వంటివి చేయ్యొచ్చు.  


ఫేస్‌బుక్‌ (Facebook)

ఫేస్‌బుక్‌లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న వీడియోస్‌ ఫీచర్‌ను టిక్‌టాక్ ప్రత్యామ్నాయంగా ఉపయోగించొచ్చు. యాప్‌లో వీడియోల కోసం ప్రత్యేక సెక్షన్‌ ఉంది. అలానే వీడియోలను అప్‌లోడ్ చెయ్యడం ఎంతో తేలిక. అయినప్పటికీ షార్ట్‌ వీడియోల కోసం యాప్‌లోనే ప్రత్యేకంగా షార్ట్‌ అనే ఫీచర్‌ను తీసుకురావాలని భావిస్తోంది ఫేస్‌బుక్‌. ప్రస్తుతం పరీక్షల దశలో ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది.


యుట్యూబ్‌ షార్ట్స్‌ (YouTube Shorts)

టిక్‌టాక్‌ రీల్స్‌లానే ఇందులో కూడా 15 సెకన్ల వీడియోలు రూపొందించవచ్చు. దానితో పాటు ముందుగా రికార్డ్‌ చేసిన వీడియోకు స్పెషల్ ఎఫెక్ట్స్‌, సౌండ్ ట్రాక్‌లు యాడ్‌ చేసుకోవచ్చు. వీడియో స్పీడ్ కంట్రోల్, మల్టీ సెగ్మెంట్ కెమెరా వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.


డబ్‌స్మాష్‌ (Dubsmash)

మనకు నచ్చిన ఆడియోకు లిప్ సింక్‌ చేస్తూ వీడియో రికార్డ్‌ చేసేందుకు ఉద్దేసించిన యాప్‌ డబ్‌స్మాష్. ఇందులో కూడా టిక్‌టాక్‌ తరహా ఫీచర్స్‌ ఉన్నప్పటికీ ఆ మేరకు పాపులర్‌ కాలేదు. ఫిల్టర్స్‌, స్టిక్కర్స్‌, టెక్ట్స్‌తో పాటు రకరకాల ఎఫెక్ట్స్‌ని యాడ్‌ చేయ్యొచ్చు. ఇప్పటి వరకు ఈ యాప్‌ 100 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ జరిగాయి. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని కూడా ప్రయత్నించవచ్చు. 


ట్రిల్లర్‌ (Triller)

అమెరికన్‌ యూజర్స్‌ బాగా పరిచయమైన ఈ యాప్‌ టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత వెలుగులోకి వచ్చింది. జస్టిన్‌ బీబర్‌ వంటి సెలబ్రిటీలు కూడా దీన్ని ఉపయోగించారు. మ్యూజిక్‌ వీడియోలను ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 100 ఫిల్టర్స్‌ ఉన్నాయి. వ్యక్తిగత వీడియోలతో పాటు ఇతరులతో కలిసి బృందంగా వీడియోలను రూపొందించొచ్చు. టెక్ట్స్‌, ఎఫెక్ట్స్ యాడింగ్ ఫీచర్‌ ఉంది.


స్నాప్‌చాట్ (Snapchat)

ఎన్నో ఏళ్లుగా షార్ట్‌ వీడియోలు రూపొందించేందుకు స్నాప్‌చాట్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఆ వీడియోలకు పరిమిత కాల వ్యవధి ఉండటంతో కొద్ది రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. అందుచేతనే ఈ యాప్‌ అంతగా పాపులర్ కాలేకపోయింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత డౌన్‌లోడ్స్‌ పెరిగాయి. ఇందులో చాటింగ్, ఫొటో షేరింగ్‌తో పాటు ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ ఉన్నాయి.


ఫైర్‌వర్క్‌ (Firework)

టిక్‌టాక్‌ తరహాలోనే ఈ యాప్‌ పనిచేస్తుంది. ఇందులో 30 సెకన్ల నిడివి ఉన్న హైక్వాలిటీ వీడియోలను రికార్డ్‌ చేసుకోవచ్చు. యాప్‌లోనే వీడియోఎడిటింగ్‌ టూల్స్‌ ఉన్నాయి. ఈ యాప్‌ ద్వారా మనం రూపొందించిన వీడియోలతో క్యాష్‌ ప్రైజ్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది.


బైట్ (Byte)

ఇందులో 16 సెకన్లు అంతకు తక్కువ నిడివి ఉన్న వీడియోలను రికార్డు చేయ్యొచ్చు. ఈ యాప్‌లో ప్రత్యేక కమ్యూనిటీస్‌ ఉన్నాయి. వీటిలో ఫన్నీ, హార్రర్‌, సినిమాటిక్‌ వంటి కేటగిరీలకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న