ప్రతి పనికీ ఉందో ‘ఆప్’!ఇంట్లో సరుకులూ కూరగాయలూ లేవు... పర్వాలేదు, ఫోన్ ఉందిగా! ఫ్రెండ్స్ వచ్చారు, వంట చేసే టైమ్ లేదు... కంగారు ఎందుకు, స్విగ్గీ ఆప్ ఉంది. అర్జంటుగా బంధువులింటికి వెళ్లాలి, బయట వర్షం... ఇబ్బంది లేదు, ఆప్ ఉంటే నిమిషాల్లో కారు ఇంటి ముందుకొస్తుంది. పక్కింట్లో పెద్దాయనకి సీరియస్, అర్జంటుగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి... ఒక్క క్షణం, ఫోనులో అంబులెన్స్ బుక్ చేద్దాం.