
రాశిఫలం
గ్రహబలం (డిసెంబరు 1 - 7)
శుభకాలం మొదలైంది. ధర్మబద్ధంగా వృద్ధిలోకి వస్తారు. మీ నిజాయతీ నలుగురికీ ఆదర్శమవుతుంది. మనోబలం సర్వదా శ్రేయస్సునిస్తుంది. ధనలాభం విశేషంగా ఉంటుంది. అవరోధాలున్నా అంతిమంగా కార్యసిద్ధిని పొందుతారు. కృషిని పెద్దలు గుర్తిస్తారు. నిస్వార్థంగా ఆలోచించండి, తిరుగులేని విజయం లభిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. |
పేరు ప్రతిష్ఠలున్నాయి. ఒత్తిడిని జయిస్తే అంతా విజయమే. బంధుమిత్రుల సహకారం అందుతుంది. భూలాభం ఉంటుంది. వ్యాపార దక్షత లభిస్తుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మోసంచేసే వారున్నారు. ఏకాగ్రతతో వ్యవహరిస్తే సమస్య తొలగి లక్ష్యాన్ని చేరతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. విష్ణుస్మరణ ఆనందాన్నిస్తుంది. |
ప్రతి అడుగూ అభివృద్ధి దిశగా వేయాలి. అవరోధాలున్నాయి, చాకచక్యంగా అధిగమించండి. ఆర్థికంగా శుభఫలితం ఉంది. వృత్తి ఉద్యోగపరంగా ఊరట లభిస్తుంది. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుంది. చంచల స్వభావం సమస్యలకు కారణమవుతుంది. వారం చివరలో మంచి జరుగుతుంది. దుర్గాదేవిని స్మరించండి. |
ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మనోబలంతో శుభం జరుగుతుంది. ఆత్మీయుల సహకారం అవసరం. కుటుంబంలోని వారితో సఖ్యతగా ఉండాలి. పొరపొచ్చాలు రానీయవద్దు. పట్టుదలతో పనులు పూర్తవుతాయి. దైవబలం రక్షిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. |
మంచికాలం నడుస్తోంది. త్వరగా విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏకాగ్రతతో కార్యసిద్ధి లభిస్తుంది. విశేష ప్రయత్నం ద్వారా లాభపడతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. గొప్ప భవిష్యత్తుకోసం కృషిచేయటానికి అనువైన కాలం. ఇష్టదేవతా స్మరణతో శాంతి లభిస్తుంది. |
శ్రేష్ఠమైన కాలం ఇది. ధనబలం పెరుగుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. బుద్ధిబలం బాగా సహకరిస్తుంది. కొత్త ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. భూ, వాహనాది యోగాలున్నాయి. శాంతచిత్తంతో పనిచేస్తే పెద్దలు ప్రసన్నులవుతారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి. |
ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండండి. కాలం అంతగా సహకరించడం లేదు. ప్రతి పనీ శ్రద్ధగా చేయాలి. ఉద్యోగంలో శుభఫలితం ఉంటుంది. అసహనం పనికిరాదు. ఉన్నతమైన భవిష్యత్తును ఊహించండి. సున్నితంగా మాట్లాడండి. అపార్థాలకు తావివ్వకండి. న్యాయం కాపాడుతుంది. సమాజంలో తగినంత గౌరవం లభిస్తుంది. ఇష్టదేవతా ధ్యానం సదా రక్షిస్తుంది. |
ఉత్తమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి సమయం నడుస్తోంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గృహలాభం ఉంది. ఆశయం నెరవేరుతుంది. కొందరివల్ల విఘ్నాలుంటాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. ప్రయాణాల్లో ఆపదలుంటాయి. తగు శ్రద్ధ వహించండి. శివస్మరణ రక్షణనిస్తుంది. |
కార్యసిద్ధి ఉంది. అనుకున్న పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధైర్యసాహసాలు ప్రదర్శించండి. స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. బుద్ధిబలంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. సుఖసంతోషాలుంటాయి. దగ్గరివారితో విభేదాలు రానివ్వద్దు. భూ సంబంధిత అంశాలూ దూర ప్రయాణాలూ కలిసి వస్తాయి. ఆదిత్య హృదయం చదవాలి. |
ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. సకాలంలో పనుల్ని పూర్తిచేయండి. ఆలస్యమైతే విఘ్నాలు ఎదురవుతాయి. ఇబ్బందికర సంఘటనలున్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఒత్తిడి కలిగించే వారున్నారు. సహనంతో ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది. వారాంతంలో ఆనందించే అంశాలు ఉన్నాయి. ఈశ్వర ఆరాధన శక్తినిస్తుంది. |
అదృష్టకాలం నడుస్తోంది. విశేషమైన లాభాలున్నాయి. గట్టిగా ప్రయత్నించండి. విజయం సిద్ధిస్తుంది. శత్రుదోషం తొలగి మిత్రులవల్ల మేలు జరుగుతుంది. సంకల్పసిద్ధి ఉంది. గౌరవం పెరగుతుంది. చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం లాభాన్నిస్తుంది. పదిమందికీ ఆదర్శవంతులవుతారు. బంగారు భవిష్యత్తును నిర్మించుకుంటారు. విష్ణునామస్మరణతో శుభం జరుగుతుంది. |
పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. దైవబలంతో లక్ష్యాన్ని చేరతారు. సంయమనాన్ని పాటించండి. బాధ్యతలను సమర్థంగా పూర్తిచేస్తారు. ఓర్పు మిమ్మల్ని నడిపిస్తుంది. శాంతియుతంగా సంభాషిస్తే సమస్యలుండవు. అవగాహనా సామర్థ్యంతో పెద్దలను మెప్పించండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి. |