close

ఫొటోఫీచర్

‘చిత్ర’మైన కొలను!

కొలను ఒడ్డున నిలబడి పిల్లగాలిని ఆస్వాదిస్తూ నీటి అందాలను చూడటం ఎవరికైనా ఇష్టమే. అయితే ఆ కొలను అచ్చం చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన చిత్రంలా కనిపిస్తే మాత్రం ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం! ఇలాంటి చిత్రమైన అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే జపాన్‌లోని నమోనాకి కొలను దగ్గరికి వెళ్లాల్సిందే. అక్కడి అగ్నిపర్వతం అడుగుభాగం నుంచి వచ్చే స్వచ్ఛమైన స్ఫటికంలాంటి నీటితో నిండి ఉండే ఈ కొలనులో రంగురంగుల నీటి మొక్కలతో పాటు అందమైన చేపలూ ఉంటాయి. ఈ నీళ్లలో సూర్యరశ్మి పడే కోణాన్ని బట్టి రంగులు మారుతూ చూడగానే ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుందట ఈ కొలను. ప్రఖ్యాత చిత్రకారుడు మానెట్‌ గీసిన చిత్రాల్లా అక్కడి దృశ్యాలు కనువిందు చేస్తుండటంతో దీన్ని మానెట్స్‌ పాండ్‌గా పిలుస్తున్నారు. ఈ ఫొటోలు చూస్తుంటే ఆ పిలుపు సబబే అనిపిస్తోంది కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.