close
ఆన్‌లైన్‌ స్టార్లు... ఈ ఏడాది వీళ్లు!

ఆన్‌లైన్‌ స్టార్లు... ఈ ఏడాది వీళ్లు!

ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్‌, కాస్త కాలక్షేపం కోసం యూట్యూబ్‌, నచ్చిన వాళ్లతో టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్‌, సెలెబ్రిటీలు ఏమంటున్నారో తెలుసుకోవడానికి ట్విటర్‌... ఇలా తెల్లారి లేచింది మొదలు, నిద్రపోయే వరకూ కోట్లాదిమంది సోషల్‌ మీడియాలో గంటలు తరబడి గడిపేస్తున్నారు. ఆ క్రమంలో అనేక విషయాలను చర్చిస్తూ, శోధిస్తూ, ఇతరులతో పంచుకుంటున్నారు. అలా 2016లో అంతర్జాలంలో ఎక్కువ మందిని ఆకర్షించిన అంశాలివే అంటున్నాయి ఆయా సంస్థలు...

యూట్యూబ్‌లో కాలా చష్మా!

సినిమా పాటలకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదని యూట్యూబ్‌లో వాటికి వచ్చే హిట్లే నిరూపిస్తున్నాయి. ‘కాలా చష్మా’ అంటూ కత్రినా కైఫ్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియోని యూట్యూబ్‌లో అత్యధికంగా పద్నాలుగు కోట్ల మందికి పైగా చూశారంటేనే వాటికి ఎలాంటి క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తరవాతి స్థానంలో ఉన్న ఆలియా భట్‌ నటించిన ‘లడ్కీ బ్యూటీఫుల్‌ కర్‌గయి చుల్‌’ అనే పాటను కూడా దాదాపు పదకొండున్నర కోట్ల మంది చూశారు.

ఆ జాబితాలో ఉన్న మ్యూజిక్‌ వీడియోలు:
1. కత్రినా కైఫ్‌-కాలా చష్మా (14.5 కోట్లు) 2. ఆలియా భట్‌-లడ్కీ బ్యూటీఫుల్‌ (11.5 కోట్లు)
3. రణ్‌బీర్‌ కపూర్‌- సున్‌లే పుకార్‌ బులెయా (9.5 కోట్లు)
4. సల్మాన్‌ఖాన్‌- బేబీకో బేస్‌ పసంద్‌ హై (8.6 కోట్లు)
5. టైగర్‌ ష్రాఫ్‌-చమ్‌ చమ్‌ చమ్‌ (7.1 కోట్లు)
పాటల తరవాత యూట్యూబ్‌లో ఎక్కువ ఆదరణ ఉంది సినిమా ట్రెయిలర్లకే. ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ ట్రెయిలర్‌ని అన్నింటికంటే ఎక్కువమంది చూస్తే, రజనీకాంత్‌ నటించిన ‘కబాలి’ ట్రెయిలర్‌కు టాప్‌ 5లో చోటు దక్కింది.

వరసగా ఇలా:
1. దంగల్‌ (3.7 కోట్లు)
2. సుల్తాన్‌ (3.4 కోట్లు)
3. కబాలి (3.3 కోట్లు)
4. శివాయ్‌ (2.9 కోట్లు)
5. ఎం.ఎస్‌.ధోని (2.6 కోట్లు)
వీడియోల్లో మొదటి స్థానం ప్రముఖ హిందీ హాస్య కళాకారుడు కపిల్‌ శర్మ నిర్వహిస్తోన్న షోకి సల్మాన్‌ఖాన్‌ అతిథిగా విచ్చేసిన ఎపిసోడ్‌కే దక్కింది.

వీడియోలు:
1. సల్మాన్‌-కపిల్‌ శర్మ షో (2.3 కోట్లు) 2. ‘వాయిస్‌ ఇండియా కిడ్స్‌’ కార్యక్రమంలో అయత్‌ షేక్‌ అనే అమ్మాయి పాట(2.1 కోట్లు) 3. క్రైమ్‌ ప్యాట్రోల్‌ కార్యక్రమంలో 254వ ఎపిసోడ్‌ (1.9 కోట్లు) 4. రూ.2వేల నోట్ల పైన ఓ న్యూస్‌ చానల్‌ వీడియో (కోటి) 5. ‘ట్రూత్‌ ఆర్‌ డేర్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ (60లక్షలు)


ఫేస్‌బుక్‌లో దివాలీ సందడి

న దేశంలో కుర్రాళ్లు ఇళ్లలో కంటే ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌లోనే గడుపుతున్నారు. ఆ సమయంలో తెలుగు సినిమాల నుంచి అమెరికా ఎన్నికల వరకూ రకరకాల విషయాల గురించి మాట్లాడతారు. అలా ఈ ఏడాది భారతీయ ఫేస్‌బుక్‌ వినియోగదార్లలో ఎక్కువ మంది చర్చించుకుంది దీపావళి పండగ గురించే. శుభాకాంక్షలు చెప్పే పొటోలూ, వీడియోలూ, టపాసులు వద్దంటూ పోస్టులూ... ఇలా ఆ వేడుక గురించే దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరిగింది. ఆ తరవాతి స్థానాలు క్రికెట్‌, ఉరీ ఉగ్ర దాడుల లాంటి వాటికి దక్కాయి.

ఆ జాబితాలో ముందున్నవి ఇవే...
1. దివాలీ
2. క్రికెట్‌
3. ఉరీ ఉగ్రదాడులూ, మెరుపు దాడులు

4. ఎం.ఎస్‌.ధోనీ సినిమా
5. అంతర్జాతీయ డీజే హార్డ్‌వెల్‌ భారత పర్యటన
6. ప్రియాంక చోప్రా 7. రియో ఒలింపిక్స్‌

8. పోకెమాన్‌ గో
9. పఠాన్‌కోట్‌
10. ఐ ఫోన్‌ 7 లాంచ్‌

* ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది చర్చించుకున్న తొలి పది అంశాల్లోనూ ‘పోకెమాన్‌ గో’ ఆటకు చోటు దక్కింది. అమెరికా ఎన్నికలు, బ్రెజిల్‌లో రాజకీయాలూ, పోకెమాన్‌ గో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

* ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోల జాబితాలో సెలెబ్రిటీలను తలదన్ని ఎక్కువగా ‘ఎజాజ్‌ అహ్మద్‌’ అనే టీచర్‌ ఇంగ్లిష్‌లో కలిపి రాతను సులువుగా ఎలా రాయాలో వివరించే లైవ్‌ వీడియోనే 92 లక్షల మంది వీక్షించడం విశేషం.

టాప్‌ 5లో ఉన్న ఫేస్‌బుక్‌ లైవ్‌ వీడియోలు
1. ఎజాజ్‌ అహ్మద్‌ ఇంగ్లిష్‌ పాఠం (92 లక్షలు)
2. సోనాక్షి సిన్హా లైవ్‌ చాట్‌ (69 లక్షలు)
3. అమితాబ్‌ బచ్చన్‌ తొలి లైవ్‌ వీడియో (66 లక్షలు)
4. షారుక్‌, ఆలియాభట్‌ల లైవ్‌ సంభాషణ (62 లక్షలు)
5. ఆజ్‌ తక్‌ ఛానెల్‌లో ఓ న్యూస్‌ వీడియో (53లక్షలు).


ఇన్‌స్టాగ్రామ్‌లో మెరైన్‌ డ్రైవ్‌

న్‌లైన్‌లో ఫొటోలను పంచుకునే అతిపెద్ద వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో గతేడాది ఎక్కువ మంది షేర్‌ చేసిన ఫొటో తాజ్‌మహల్‌దే. ఈసారి ఆ స్థానాన్ని ముంబైలోని మెరైన్‌ డ్రైవ్‌ ప్రాంతం సొంతం చేసుకుంది. ఆంగ్ల అక్షరం ‘సి’ ఆకారంలో మూడున్నర కిలోమీటర్ల పొడవున్న ఆ తీర ప్రాంతానికి సంబంధించిన అనేక ఫొటోలనే ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారులు ఈసారి విపరీతంగా పోస్ట్‌ చేశారు.

టాప్‌ 5 ఫొటోలు:
1. ముంబై మెరైన్‌ డ్రైవ్‌
2. తాజ్‌మహల్‌ 3. హాజ్‌ ఖాస్‌ విలేజ్‌
4. జుహు బీచ్‌
5. ఇండియా గేట్‌


గూగుల్‌లో సింధు నంబర్‌ 2!

ప్రపంచంలో ఎవరికి ఏం తెలిసినా తెలియకపోయినా గూగుల్‌కి మాత్రం అన్నీ తెలుస్తాయంటారు. అలా 125 కోట్లకుపైగా జనాభా ఉన్న భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారులు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌నైతే రెండో స్థానంలో తెలుగు తేజం పీవీ సింధు నిలవడం విశేషం. మొత్తంగా టాప్‌-10లో ఆరుగురు అమ్మాయిలే ఉన్నారు. క్రికెట్‌ను వెనక్కినెట్టి ఈసారి ఎక్కువమంది శోధించిన అంశాల్లో రియో ఒలింపిక్స్‌కి తొలి స్థానం దక్కింది. ఖాన్‌ల త్రయాన్ని దాటుకొని ఎక్కువ మంది వెతికిన బాలీవుడ్‌ నటుల జాబితాలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, నటీమణుల్లో ‘లోఫర్‌’తో తెలుగు వాళ్లకూ పరిచయమైన దిశా పాట్నీ తొలి స్థానాలు దక్కించుకున్నారు.

ఎక్కువ మంది శోధించిన వ్యక్తులు:
1. డొనాల్డ్‌ ట్రంప్‌
2. పీవీ సింధు
3. సోనమ్‌ గుప్తా
4. దీపా కర్మాకర్‌
5. దిశా పాట్నీ

టాప్‌ 5 సినిమాలు:
1. సుల్తాన్‌ 2. కబాలి
3. ఉడ్తా పంజాబ్‌
4. ఎయిర్‌లిఫ్ట్‌
5. ఏ దిల్‌ హై ముష్‌కిల్‌

వార్తాంశాలు:
1. రియో ఒలింపిక్స్‌
2. అమెరికా ఎన్నికలు
3. బ్రెక్సిట్‌
4. 7వ పే కమిషన్‌
5. ఆటో ఎక్స్‌పో 2016


ట్విటర్‌లో కోహ్లి ‘బంగారం’

ఏడాది భారత్‌లో కోహ్లి చేసిన ఓ ట్వీట్‌ని ట్విటర్‌లో నిమిషాల్లో వేలమంది పంచుకున్నారు. 2016కి దాన్నే ‘గోల్డెన్‌ ట్వీట్‌’గా ట్విటర్‌ ప్రకటించింది. ఏడాది మొదట్లో ఆటలో విరాట్‌ వైఫల్యాలకు అతడి గాళ్‌ఫ్రెండ్‌ అనుష్కే కారణమంటూ సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్న సమయంలో, విరాట్‌ కల్పించుకొని ‘అమ్మాయి అని కూడా చూడకుండా అనుష్కను విమర్శిస్తున్న వాళ్లంతా సిగ్గుపడాల్సిన సమయమిది. మొదట్నుంచీ తను నాకు సానుకూల శక్తినే అందిస్తోంది’ అంటూ చేసిన ట్వీట్‌ని 40వేల మందికిపైగా రీట్వీట్‌ చేశారు.

మోదీ నంబర్‌ వన్‌
2016లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ని దాటుకొని ట్విటర్‌లో ఎక్కువమంది అనుసరించే వ్యక్తిగా మారడం విశేషం.

తొలి ఐదుగురు వీరే:
1. నరేంద్ర మోదీ (2.52 కోట్లు)
2. అమితాబ్‌ బచ్చన్‌ (2.38 కోట్లు)
3. షారుక్‌ ఖాన్‌ (2.24 కోట్లు)
4. సల్మాన్‌ ఖాన్‌ (2.06 కోట్లు)
5. ఆమిర్‌ ఖాన్‌ (1.92 కోట్లు)

రద్దుపైనే చర్చ
ట్విటర్‌లో మొదటి పది నెలలూ స్పందించిన విషయాలన్నింటినీ పక్కనపెడుతూ ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయానికే ఎక్కువగా చర్చించిన అంశాల జాబితాలో మొదటి స్థానం దక్కింది. దాని పైన 24గంటల్లో ఆరున్నర లక్షల మంది ట్వీట్లు చేశారు.

ఎక్కువగా చర్చించిన అంశాలు
1. పెద్ద నోట్ల రద్దు
2. రియో ఒలింపిక్స్‌లో మహిళల విజయం
3. భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌
4. దిల్లీ కాలుష్యం
5. దీపావళి


సన్నీ... ఐదోసారి

తిపెద్ద సర్చ్‌ ఇంజిన్లలో ఒకటైన ‘యాహూ’లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల్లో రాజకీయ నాయకులూ, బాలీవుడ్‌ దిగ్గజాలను దాటుకొని సన్నీ లియోని వరసగా ఐదోసారి తొలి స్థానంలో నిలవడం విశేషం. ఎక్కువ మంది శోధించిన క్రీడాకారుల జాబితాలో పీవీ సింధు తొలి స్థానంలో నిలిచింది. ప్రజలను ఆశ్చర్యపరిచిన నిర్ణయాల జాబితాలో పెద్ద నోట్ల రద్దుతో పాటు నల్లధనం వెల్లడి పథకం, రిలయన్స్‌ జియో ఉచిత సేవలూ లాంటి విషయాలు చోటు దక్కించుకున్నాయి. ఆర్థిక రంగంలో ముకేష్‌ అంబానీ ‘న్యూస్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యారు.

ఎక్కువ మంది శోధించిన వ్యక్తులు:
1. సన్నీ లియోని
2. నరేంద్ర మోదీ
3. అరవింద్‌ కేజ్రీవాల్‌
4. సల్మాన్‌ ఖాన్‌
5. బిపాసా బసు

క్రీడాకారులు:
1. పీవీ సింధు
2. దీపా కర్మాకర్‌
3. ఎం.ఎస్‌.ధోని 4. విరాట్‌ కోహ్లి
5. సాక్షి మలిక్‌

వార్తాంశాలు:
1. ఐపీఎల్‌
2. రియో ఒలింపిక్స్‌
3. ఫ్రీడమ్‌ 251 సెల్‌ఫోన్‌
4. ఏడో పే కమిషన్‌
5. 2016 బడ్జెట్‌


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.