close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అందం పెరిగిపోతోంది

రంగంలోనైనా రాణించడానికి ఎవరికి ఎక్కువ అర్హతలుంటే వారే పైకెదుగుతారు. అలాగే హీరోయిన్లు కూడా తమకు ఎంతో ముఖ్యమైన అందాన్ని కాపాడుకోవడానికీ వీలైతే మరింతగా పెంచుకునేందుకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి చేసే వ్యాయామాల వరకూ అన్నింటిలో వారికి అందం గురించిన ఆరాటం తప్పదు. అందుకే, కొందరు సన్నబడటం ద్వారానూ సౌందర్య పోషణతోనూ ఆహార నియమాల ద్వారానూ అందాన్ని పెంచుకుంటుంటే మరికొందరు ప్లాస్టిక్‌ సర్జరీలూ కాస్మొటిక్‌ సర్జరీలతో ముక్కూ, పెదవులూ, దవడల్లాంటి వాటిని సరిచేయించుకుని సౌందర్యానికి చిరునామాగా మారిపోతున్నారు. మామూలు అమ్మాయిలే అందాన్ని పెంచుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్న రోజులివి. కాబట్టి, ఇక్కడ పాయింట్‌ ఎలా అందంగా మారారు... అన్నది కాదు. ఎంతందంగా మారారూ... అన్నదే. ఇక, అందాన్ని పెంచుకున్న హీరోయిన్ల గురించి చెప్పాలంటే శృతీహాసన్‌, శ్రీదేవి, నయనతార, శిల్పాశెట్టీ, సమంతా, అంజలి, కరీనా, కంగనా... ఇలా చాలా పెద్ద జాబితానే ఉంది. అందరూ కాలంతో పోటీ పడి అందాన్ని పెంచుకున్నవారే. శృతీహాసన్‌నే తీసుకుంటే సినిమాల్లోకి రాకముందు ఆమెను చూసినవారెవరైనా ‘ఆమె ఈమేనా’ అని ఆశ్చర్యపోవాల్సిందే. ఆ ముఖ సౌందర్యం అంతగా పెరిగిపోయింది. అందుకే, బాలీవుడ్‌ మీడియా ఈ గబ్బర్‌సింగ్‌ హీరోయిన్‌ని అద్భుతమైన ప్లాస్టిక్‌ సర్జరీకి ఉదాహరణగా పేర్కొంటోంది. అవును, ఆ సొగసు వెనక రహస్యం ముక్కుకి సర్జరీ చెయ్యడమేనట. వీటితోపాటు, తను చాలా సన్నబడింది కూడా. శ్రీదేవి విషయానికొస్తే అసలు చిత్ర పరిశ్రమలో అందంకోసం సర్జరీలు చేయించుకోవడం ఆమెతోనే మొదలైందంటారు ఫ్యాషన్‌ విశ్లేషకులు. శ్రీదేవి 80ల్లోనే ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకుని సన్నగా మార్చుకుంది. మామూలుగానే సౌందర్యరాశి అయిన ఆమెను మారిన ముక్కు మరింత చూడచక్కగా చేసింది. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకూ ఆ తర్వాత సినిమాలకూ శ్రీదేవి ముఖంలో మార్పును చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది.

కారణాలెన్నో
‘నేను అందగత్తెనని ఎప్పుడూ అనుకోలేదు. స్టార్‌ హీరోయిన్‌ అయ్యే అంత అందం నా ముఖంలో లేదని నాకు తెలుసు. మొదటి సినిమాలోని శిల్పాశెట్టినీ ఇప్పటి నన్నూ చూస్తేనే అది తెలిసిపోతుంది. అవును శారీరకంగా మానసికంగా నేనెంతో మారాను’... ఇవి బాలీవుడ్‌ అందాల తార శిల్పాశెట్టి స్వయంగా చెప్పిన మాటలు. ఆమె తన ముక్కుని అందంగా మార్చుకునేందుకు రెండుసార్లు సర్జరీ చేయించుకుందట. 41 ఏళ్ల వయసులో 20 ఏళ్ల ముందుకన్నా ఆమె అందంగా కనిపిస్తుందంటే అందుకు మరో కారణం యోగా కూడా.

నయనతార 19ఏళ్ల వయసులో తొలి సినిమాలో నటించింది. ఇప్పుడామె వయసు 32. మొదట్లో పెద్ద పెద్ద బుగ్గలతో ఈ కేరళ కుట్టి ముఖం బొద్దుగా ఉండేది. తర్వాత ఈ అమ్మడు ముఖంతో పాటు శరీరం కూడా నాజూకైపోయింది. సినిమా సినిమాకీ పెరిగిన ఆమె అందమే ఆ మార్పుని కళ్లకు కడుతుంది. ‘ఏమాయ చేసావె’... సమంతా మొదటి సినిమా. అప్పటికి తన వయసు 23. అంతకుముందు సమంత ప్రకటనల్లో నటించేది. అప్పటికీ మొదటి సినిమాకూ ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ ముఖంలో ఎంత తేడా వచ్చిందో అప్పటి, ఇప్పటి ఫొటోలే చెబుతాయి. ఇక, పదేళ్ల కిందట 19 ఏళ్ల వయసులో తెలుగు చిత్రం ‘ఫొటో’లో కనిపించిన అంజలి సొగసు ఈ దశాబ్దంలో ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ భామలు కరీనా కపూర్‌, కంగనా రనౌత్‌ల గురించి చెప్పాలంటే... సినిమాల్లోకి రాకముందు కరీనా టామ్‌బాయ్‌లా ఉండేది. అంతెందుకు 16 ఏళ్ల కిందట ఆమె మొదటి సినిమా రెఫ్యూజీకీ ‘ఇప్పటికీ కూడా కరీనా అందం పెరిగిందే తప్ప తగ్గలేదు. అందుకే, 36ఏళ్ల కరీనా ఇప్పుడిప్పుడు వస్తున్న యువ హీరోల సరసన కూడా హీరోయిన్‌గా నటించగలుగుతోంది. తను కూడా సర్జరీ ద్వారా ముక్కునీ, దవడలనూ సరి చేయించుకుందట. క్వీన్‌గా బాలీవుడ్‌ని ఏలుతున్న కంగనా రనౌత్‌ పెదవులూ సర్జరీ చేయించుకుందన్న వార్తలు వచ్చాయి. 31 ఏళ్ల కంగనా కూడా తొలి చిత్రానికీ ఇప్పటికీ ఎంతో మారింది.

నిజం చెప్పాలంటే హీరోయిన్ల అందం పెరగడం వెనుక ఎన్నో కారణాలుంటాయి. పైగా ఇప్పుడు వయసుని తగ్గించేందుకూ ముడుతలని పోగొట్టేందుకూ మేనిఛాయను మెరిపించేందుకూ రకరకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వాళ్లు వాడే ఖరీదైన క్రీములూ లోషన్లతోపాటు, తీసుకునే ఆహారం, సరైన వ్యాయామం కూడా అందం మీదా శరీర సౌష్టవం పైనా ప్రభావం చూపిస్తాయి. అన్నిటికీ మించి నటీనటుల అందం విషయంలో మేకప్‌ చేసే మాయ చాలా ఉంటుంది.
అదండీసంగతి..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.