close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీవన రథాల సవ్వడి

తుకునిచ్చిన తెలంగాణనూ బతకనిచ్చిన ముంబయినీ; సమంగా ప్రేమించిన కథకుడి 46 కథల సంకలనమిది. ఉద్యోగం కోసం చూడక టీకొట్టుతో స్వయం ఉపాధి పొందిన రజాక్‌ బాబా ‘చమురుదీపం’ కథను మహారాష్ట్రలో బాలభారతి తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడం విశేషం. మస్కట్‌ వెళ్లిన పోశయ్య కష్టపడి ఇంటికి డబ్బు పంపితే కన్నవారే అతడిని మోసగించిన వైనం ‘నిలువుదోపిడీ’. మగపెళ్లివారి దర్పం, వధువు తరఫు వారిని అవమానించే అభిజాత్యానికి అద్దంపట్టే కథ ‘లగ్గం సంబురం’.  ముంబయి అంటే మురికివాడ కాదనీ జీవనోపాధికి ఓ అడుగుజాడ అనీ చాటారు రచయిత.

- పారుపల్లి శ్రీధర్‌

 

ముంబయి చూపుతో...
రచన: డా।।అంబల్ల జనార్దన్‌
పేజీలు: 286; వెల: రూ.300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు 


యాత్రానుభవాలు

గిరిప్రదక్షిణ చేసినట్లే నదికీ ప్రదక్షిణ చేస్తారు. కేవలం నర్మదా నదికే ఆ ప్రత్యేకత ఉంది అని చెబుతున్నారు రచయిత మల్లాది. ఆయన స్వయంగా చేసిన ఆ యాత్రానుభవాల సమాహారమే ఈ పుస్తకం. పదహారు రోజుల ఈ బస్సు యాత్ర విశేషాలని వివరంగా రాశారు. భిల్లుల దోపిడీలూ, సిద్ధమాయి, తాంతియా తోపే సమాధి లాంటివన్నీ ఆసక్తిరేపుతాయి. మల్లాది నవలల్లాగే ఈ యాత్రానుభవాలూ ఆపకుండా చదివిస్తాయి. దీనితో పాటు రష్యా, మెక్సికో దేశాల పర్యటనలపై కూడా మరో రెండు పుస్తకాలను ఆయన ప్రచురించారు.

- పద్మ

 

నర్మద పరిక్రమ;
పేజీలు: 133, వెల: రూ. 190/-
ట్రావెలాగ్‌ మెక్సికో;
పేజీలు: 148; వెల: రూ. 160/-
ట్రావెలాగ్‌ రష్యా;
పేజీలు: 141; వెల: రూ. 160/-
రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


దేశవిదేశీ కథలు

దేశవిదేశీ భాషలకు చెందిన 18 కథల అనువాద పుస్తకమిది. మనదేశంలో బ్రిటిష్‌ పాలనకు మరో కోణాన్ని చూపుతుంది ‘సుమాంజలి’. ఇక్కడ సైన్యంలో పనిచేసే యువకుడి యోగక్షేమాలు కనుక్కోవటానికి తల్లీ చెల్లెలూ పడే ఆదుర్దా కంటతడి పెట్టిస్తుంది. పిచ్చుక తెచ్చి పడేసిన ఓ చిన్న నగని ఆ ఇల్లాలు మోజుపడి దాచుకుంది. అది ఆమెకి ప్రాణగండమైన వైనమే రాజాజీ రాసిన ‘ముక్కుపుడక’. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహానికీ ‘కిటికీ’కీ సంబంధం ఏమిటో చెబుతుంది రస్కిన్‌ బాండ్‌ కథ. పలువురు ప్రముఖ రచయితల ఈ కథలన్నీ సరళ శైలిలో సాగిన అనువాదంతో చదివిస్తాయి, ఆలోచన రేకెత్తిస్తాయి.

- జి.రా.

 

సుమాంజలి (అనువాద కథలు)
అనువాదం: బి.వి.ప్రసాద్‌
పేజీలు: 120; వెల: రూ.100/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు


పాత, కొత్త తరాల కథ

తోటలో కోటాకు అంటే తెలుసా, ఎడ్లకు తోడాలును ఎప్పుడైనా చూశారా? వార్నిపీట గుర్తుకొచ్చిందా? ఇంకా అర్రు, తాటికర వగైరాలన్నీ మదిలో మెదులుతున్నాయా! ఆ జ్ఞాపకాలకు అక్షరరూపమే ‘నాలుగో ఎకరం’. ఉన్న భూమికి వచ్చే పైకాన్ని ఇస్తాననీ మీ మెట్టినింటి వాళ్లతో వివరంగా మాట్లాడుకుని చెప్పమనీ... కూతురితో అంటాడు పెదకాపు. ‘మరి నాలుగో ఎకరం మాటేంది’ అని అడిగేసరికి గూబ అదిరినట్లవుతుంది. పంటలు లేవని, ఫలసాయం ఇవ్వలేని తాను - ‘ఎప్పుడో ఒకప్పుడు నీకే ఓ ఎకరం గట్టుపెడతాలే’ అని మాటవరసకి అనడాన్ని ఆమె గట్టిమాటగా తీసుకున్న ఫలితమది. చెట్లకి డబ్బులు కాయాలే కానీ ఆ కొమ్మలూ కొట్టుకు చస్తాయని తెలుసుకుంటాడు. పల్లెబతుకు, నడి మధ్యన నగరీకరణ- ఆ రెండింటి నడుమా నలిగిపోయే పాత, కొత్త తరాల కథనమిది. తాటిపండు, ముంజకాయలు, చెరుకుగడల రుచులు చవులూరిస్తాయి. పచ్చి తామరాకులో వేడి చక్రపొంగలిలాంటి అనుభవమిచ్చే రచన ఇది. మరో పుస్తకం ‘శ్రీరామాయణం’ రాజాజీ రామాయణ పఠన ఫలితం. సాధారణ చదువరుల కోసం- అందులోనూ ప్రధానంగా బిడ్డల తల్లులకోసం రాశాననీ రాముడి కథను వారిలో కొందరైనా తమ పిల్లలకు చెబుతారన్నదే ఆశ అనీ అంటారు రచయిత.

- శరత్‌

 

నాలుగో ఎకరం;
పేజీలు: 74; వెల: రూ.100/-
శ్రీరామాయణం;
పేజీలు: 268; వెల: రూ. 150/-
రచన: శ్రీరమణ; ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.