close
రాశిఫలం

గ్రహబలం (నవంబరు 17 - 23)

అదృష్ట కాలమిది. ఇప్పుడు చేసే పనులు శుభాన్నిస్తాయి. ఆత్మస్థైర్యం మెండుగా ఉంటుంది. అర్థలాభం, కీర్తి లభిస్తాయి. మనసు శాంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. భూ, గృహ, వాహనాది యోగాలున్నాయి. అంతా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. వాదనలతో కాలం వృథా చేసేవారున్నారు. ఇష్టదైవస్మరణ మంచి చేస్తుంది.

బుద్ధిబలంతో విజయం లభిస్తుంది. పనుల్లో పొరపాట్లకు తావివ్వవద్దు. ఫలితాలు రావడంలో ఆలస్యమవుతుంది. సాహసోపేత నిర్ణయాలు రక్షిస్తాయి. కొందరివల్ల అపకారం జరగవచ్చు. ఆలోచించి అడుగువేయండి. దగ్గరివారి సలహా పనిచేస్తుంది. అపార్థాలకు తావివ్వవద్దు. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

అదృష్టయోగముంది. నిదానంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. ధనధాన్యాది లాభాలున్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రమాదముంది. సర్దుకుపోయే ధోరణి అవసరం. ఖర్చు విషయంలో జాగ్రత్త. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితముంది. ఆంజనేయ ప్రార్థన శక్తినిస్తుంది.

విజయం లభిస్తుంది. పెద్దలను మెప్పిస్తారు. సంతృప్తికరమైన జీవితం ఏర్పడుతుంది. మేలు చేసేవారున్నారు. ప్రయత్నం ఫలిస్తుంది. అవరోధాలను అధిగమిస్తారు. మనసును ఇబ్బందిపెట్టే సందర్భాలున్నాయి. గతం కన్నా శ్రమ పెరుగుతుంది. గృహ ప్రయత్నాలు లాభాన్నిస్తాయి. కుటుంబంలోని వారికి శుభం జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.

శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తారు. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. పట్టువిడుపులతో ముందుకు సాగండి. విఘ్నాలను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. న్యాయపరమైన విజయం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది.

యోగ్యమైన కాలం నడుస్తోంది. చేపట్టే పనుల్లో విజయముంటుంది. వ్యాపారంలో బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. గృహ వాహనాది లాభాలు కలుగుతాయి. సమయానికి ధనం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వవద్దు. శత్రువులవల్ల అపకారం జరిగే ప్రమాదముంది. శివస్మరణ రక్షణనిస్తుంది.

ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ధైర్యంగా మాట్లాడాలి. మోసం చేసేవారున్నారు. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. ఎదురుచూస్తున్న ఫలితం వారాంతంలో వస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

ధనలాభం ఉంది. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. మనసులోని కోరిక తీరుతుంది. గృహంలో శుభాలు జరుగుతాయి. కొందరివల్ల మేలు చేకూరుతుంది. ఇంటా బయటా శాంతి లభిస్తుంది. పరిస్థితులు సహకరిస్తాయి. కష్టాలు తొలగుతాయి. వారం మధ్యలో విఘ్నాలున్నా అనుభవంతో వాటిని అధిగమిస్తారు. దగ్గరివారి సూచనలు అవసరం. ఇష్టదేవతారాధన ఆనందాన్నిస్తుంది.

మనసుకు శక్తి లభిస్తుంది. కార్యాలు త్వరగా పూర్తి అవుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. పెద్దల మన్ననలు అందుకుంటారు. మేలు చేసేవారున్నారు. గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి. ఒక శుభవార్త వింటారు. దగ్గరివారితో గొడవలు రాకుండా చూసుకోవాలి. వేంకటేశ్వర ధ్యానం జయాన్నిస్తుంది.

ఆత్మవిశ్వాసంతో పనిచేసి లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా శుభఫలితం లభిస్తుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. ప్రయత్నలోపం పనికిరాదు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మనోబలం రక్షిస్తుంది. ఎంత కష్టపడితే ఫలితం అంత రెట్టింపు వస్తుంది. కుటుంబసభ్యులకు శుభం జరుగుతుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. ఇష్టదేవతను స్మరించండి.

శుభ యోగముంది. అధికార లాభముంది. అర్హతకు తగ్గ ఫలితం సిద్ధిస్తుంది. చంచలత్వం పనికిరాదు. సహనంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆటంకాలున్నా అంతిమంగా విజయం వరిస్తుంది. మితభాషణం వల్ల మేలు చేకూరుతుంది. దైవబలం కాపాడుతోంది. గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. ఒక మేలు జరుగుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

ఆర్థికాంశాలు బాగున్నాయి. దైవబలంతో పనులు పూర్తి అవుతాయి. లక్ష్యాన్ని చేరాలంటే బాగా కష్టపడాలి. ఖర్చు విషయంలో జాగ్రత్త. మిత్రులవల్ల ఉపకారం జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. ఒక శుభవార్త వింటారు. నిరుత్సాహపరిచే సంఘటనలున్నాయి. బుద్ధిబలంతో వాటిని ఎదుర్కోవాలి. శుభఫలితాల కోసం నవగ్రహ శ్లోకాలు పఠించండి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.