close

స్నానం నీళ్లూ శుద్ధంగా!

మామూలుగా మనం మంచినీళ్లు తాగాలంటే ఫిల్టర్‌ చేసినవే తాగుతాం. కానీ స్నానానికి మాత్రం ట్యాంకులోవి వాడతాం. అవి నేరుగా భూమిలోంచి వచ్చినవి అయినా లేదా కుళాయి ద్వారా సరఫరా అయినవి అయినా చర్మానికీ, జుట్టుకీ హాని కలిగించే ఖనిజాలూ, క్లోరిన్‌లాంటి రసాయనాలూ అందులో ఉంటుంటాయి. మనం వాడే సబ్బు సరిగా నురగ రాకుండా విరిగిపోయినట్టుగా అవడానికి ఇలాంటి నీళ్లే కారణం. అయితే స్నానం చేసే నీళ్లనూ చిటికెలో శుద్ధి చేసేందుకు కొత్తగా మార్కెట్లోకి వస్తోంది ‘వాండ్‌ షవర్‌ సిస్టమ్‌’. వలయాకారంలా ఉండే ఈ పరికరాన్ని షవర్‌ ముందు భాగంలో అమర్చామంటే, నీళ్లు దీనిగుండా వస్తాయి. అక్కడ నీరు శుద్ధి అయి, చర్మానికీ జుట్టుకీ మేలు చేసే ఖనిజాలూ, విటమిన్లను కలగలపుకుని షవర్‌ ద్వారా బయటికి వస్తుంది. ఇక మనం మంచి నీళ్లతో స్నానం చేసినట్టే... ఏమంటారు!


ఇది పాస్తా స్ట్రా!

ళ్లుతోముకోవడం దగ్గర్నుంచి పడుకునేదాకా అన్ని చోట్లా ప్లాస్టిక్‌ వాడకం అధికమవుతోంది. కూల్‌డ్రింకులూ, జ్యూసులూ తాగాలన్నా ప్లాస్టిక్‌ స్ట్రాలనే వినియోగిస్తున్నాం. వీటిని ఎంతగా వాడుతున్నామంటే ఇటీవల చేసిన ఓ పరిశోధన ప్రకారం ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బీచుల్లో ఎనిమిదివందల కోట్లకుపైగా స్ట్రాలు పోగుపడ్డాయట. ఆరోగ్య పరంగానూ ప్లాస్టిక్‌ వాడటం అంత మంచిది కాదు. అందుకే ఈ మధ్య ‘పాస్తా స్ట్రా’లు తయారవుతున్నాయి. పాస్తా అనగానే తినేది అని మాత్రమే ఇప్పటి దాకా మనకు తెలుసు. కానీ ఇప్పుడు పాస్తానూ జ్యూసులూ, కూల్‌డ్రింకులు తాగే స్ట్రాలాగా తయారు చేస్తున్నారు. అచ్చం స్ట్రా ఆకృతిలోనే తయారవుతున్న వీటితో ఎంచక్కా జ్యూసులు తాగేయొచ్చు. పర్యావరణంతో పాటు మనకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు.


ఫ్లవర్‌వేజ్‌ అతికించేద్దాం!

మామూలుగా ఫ్లవర్‌వేజులంటే హాల్లోనో, బెడ్‌రూమ్‌లోనో అది కూడా టీపాయ్‌ మీదో టేబుల్‌ మీదో ఉంటాయి. కానీ ‘స్టికీ సిలికాన్‌ వాల్‌ ఫ్లవర్‌ వేజులు’ మాత్రం గోడలూ, అద్దాల మీద కనిపిస్తాయి. ఎందుకంటే వెనక ఉన్న పేపర్‌ను తొలగించి వీటిని ఎంచక్కా గోడకు అతికించేయొచ్చు. అందులో నీళ్లు పోసి చిన్ని మొక్కలు వేయొచ్చు, లేదూ అంటే పూల రెమ్మల్ని అలంకరించుకోవచ్చు. వీటి వెనక ఉండే జిగురు గట్టిగా ఉంటుంది కాబట్టి ఒకచోట అతికించాక తీసినా మళ్లీ ఇంకోచోట అతికించుకోవచ్చు కూడా. హాలూ, లివింగ్‌రూమ్‌, బెడ్‌రూమ్‌లతో పాటు బయటి గోడలకూ, కిటికీ అద్దాలకూ అతికించుకునేందుకు ఇవి బాగుంటాయి.


కేబుల్‌ జారిపోదిక

కంప్యూటర్‌లో పనిచేసుకుంటుంటాం. పక్కన యూఎస్‌బీ వైర్‌ను కనెక్ట్‌ చేస్తాం, ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టుకుంటాం. లేదా హెడ్‌సెట్‌ను పెట్టుకుని వింటాం. వీటిని వాడనప్పుడు అలా వదిలేస్తే కింద పడిపోతుంటాయి. అందుకే ఇవి పడకుండా పట్టి ఉంచేలా కేబుల్‌ హోల్డర్లు బజార్లోకి వస్తున్నాయి. ఈ హోల్డర్ల వెనక ఉండే కాగితాన్ని తీసి మన డెస్కు మీదా గోడ దగ్గరా... ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకోవచ్చు. దీని మధ్యలో ఉండే ఖాళీ స్థలంలో వైరును పెట్టామంటే ఇక అది పడిపోనే పడిపోదు. కుక్కర్లూ, మిక్సీల్లాంటి వాటిని పక్క పక్కన పెట్టినప్పుడు దేని వైరు ఏదో అని తికమక పడకుండా అక్కడా వీటిని అతికించుకుని వైర్లు తగిలించుకుంటే సులభంగా పనిచేసుకోవచ్చు!

27 అక్టోబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.