close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చప్పరిస్తే జ్వరం తెలుస్తుంది

జ్వరం వచ్చిన పిల్లలకు మందులు వేస్తూనే రెండుమూడు గంటలకోసారి టెంపరేచర్‌ చూస్తుంటాం. అందుకోసం చిన్నారుల నాలుక కిందో లేదంటే చేతికిందో థర్మామీటర్‌ని పెట్టి జ్వరం చూడాలి. అనారోగ్యంతో అసలే చికాకుగా ఉండే పిల్లలు జ్వరం చూడనివ్వకుండా ఎంతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికోసమే అందుబాటులోకి వచ్చింది పాసిఫయర్‌ థర్మామీటర్‌. దాన్ని నోట్లోపెడితే పాసిఫయర్‌ మాదిరి చప్పరిస్తుంటారు. నిమిషం కాగానే బీప్‌ శబ్దం వచ్చి దానిపైనున్న తెర మీద టెంపరేచర్‌ కనిపిస్తుంది. ఈ థర్మామీటర్‌తో పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా జ్వరం చూడ్డం చాలా తేలిక. 


జోలపాడుతుందీ ప్యాడ్‌

చేతుల్లోకి తీసుకుని ఊపుతూ జోలపాడుతూ పిల్లల్ని నిద్రపుచ్చుతుంటారు తల్లులు. అలాంటి వారికి లల్ల వైబ్రేటింగ్‌ పాడ్‌ ఎంతో అనుకూలమైంది. మంద్రమైన సంగీతం రావడంతోపాటు వైబ్రేట్‌ అయ్యే ఈ ప్యాడ్‌ను పిల్లల బెడ్‌ కిందో, పక్కనో పెడితే చాలు. అదే బెడ్‌ను ఊపుతుంది. ఆ కదలికకు పిల్లలు వాళ్లంతట వాళ్లే నిద్రపోతారు. బ్యాటరీతో పనిచేసే ఈ ప్యాడ్‌ కాసేపటికి దానంతట అదే ఆగిపోతుంది.


పాలసీసా పడిపోకుండా...

సీసాతో పాలు తాగే పిల్లలు దాన్ని మాటిమాటికీ బయటకు తీయడం, మళ్లీ నోట్లో పెట్టుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలో, సీసా ఒక్కోసారి చేతుల్లోంచి పక్కకు జారిపోవడం, బట్టల మీద పాలు పడిపోవడం జరుగుతుంటుంది. అందుకే పిల్లలు పాలు తాగేటప్పుడు ఎవరో ఒకరు పక్కనుండాల్సిందే. అయితే పాల సీసాలను పడిపోకుండా పట్టి ఉంచే బ్యాగు తెచ్చేసుకుంటే అలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఊయలకో బేబీ క్యారియర్‌కో తగిలించేసి అందులో సీసాను ఉంచితే సరి. పిల్లలు హాయిగా పాలు తాగేస్తారు. వాళ్ళు చేతులతో పట్టుకున్నా పట్టుకోకపోయినా సీసా పక్కకు జరగదూ కింద పడదూ.


కిందపడితే ముడుచుకుంటుంది

పిల్లలు నోట్లో వేళ్లు వేసుకోకుండా... వాళ్లు చప్పరించడానికి పాసిఫయర్లు ఎంతో వీలుగా ఉంటాయని మనకు తెలిసిందే. అయితే చిన్నారులు కూర్చున్నప్పుడో నడిచేప్పుడో అది జారిపోయి కిందపడిపోతే వెంటనే దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంటారు. దాంతో దానికి అంటుకున్న మురికీ క్రిములూ పిల్లల నోటిలోకి చేరిపోయి పలు అనారోగ్యసమస్యలకు కారణమవుతాయి. అలాకాకుండా అది కిందపడుతుండగానే పీక లోపలికి ముడుచుకునేలా పాసిఫయర్లను తయారు చేస్తోంది డూడుల్‌ అనే సంస్థ. సిలికాన్‌తో చేసిన ఈ పాసిఫయర్ల వల్ల పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.