close
సిల్లీపాయింట్‌
అమెజాన్‌ కంపెనీకి మొదట కదబ్రా అని పేరుపెట్టారు... ‘అబ్రకదబ్రా’ అని ధ్వనించేలా! అంతేకాదు, తొలిసారి relentless.com అనే సైట్‌తో సేవల్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఆ సైట్‌ పేరు కొడితే... ‘అమెజాన్‌’లోకే వెళ్తారు!
* ప్రతి దేశానికీ జీరో కిలోమీటర్‌ అని ఉంటుంది. అంటే అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకి కిలోమీటర్‌ లెక్కని ప్రారంభించి ఉంటారు. భారత్‌కి అలాంటి జీరో మైలురాయి... నాగ్‌పూర్‌లో ఉంది!
* చైనా ఈశాన్య ప్రాంతాన్ని ‘మంచూరియా’ అంటారు! 
* మన సిమ్లా ఆపిల్‌ పండ్లకున్న మరో పేరు మెకింతోష్‌. అమెరికన్‌ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సంస్థ తమ కంప్యూటర్‌లని రూపొందించేటప్పుడు- సిమ్లా ఆపిళ్లని ఇష్టపడే ఓ డిజైనర్‌ వాటికి ఆ పేరు పెట్టాడట!
* ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా పదికోట్ల టన్నుల మేరకు అరటిపండ్లని సాగుచేస్తారు. కానీ ఏ దేశంలోనూ అరటిని చెట్టుపైనే పండనివ్వరు. 
* ప్రపంచంలో 90 శాతం మంది సున్నా చుట్టేటప్పుడు ఎడమ నుంచి కుడి వైపే రాస్తారు. మరి, కుడి నుంచి ఎడమకి సున్నాని రాసే ఆ పదిశాతం మంది ఎవరంటారా... ఎడం చేతివాటంవాళ్లు!
* ప్రాచీన ఈజిప్టులో మహారాజులు చనిపోయినప్పుడు వాళ్లకి నగలూ, వజ్రవైఢూర్యాలతో పాటు ఉల్లిపాయలనీ అలంకరించి సమాధి చేసేవారు. అప్పట్లో ఉల్లిపాయలకు అంత విలువ ఉండేది మరి!!
* ‘చచ్చేంత భయం’ అంటుంటాం కదా... నిజంగానే భయం వల్ల చనిపోయే అవకాశం ఉందని తేల్చారు పరిశోధకులు. ఎక్కువగా భయపడితే అడ్రినలిన్‌ హార్మోన్‌ పెరిగి అది హృదయానికి ఎక్కువగా కాల్షియాన్ని సరఫరా చేయడం ద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందట! 
* ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ అమెరికా అధ్యక్షపదవిలో అత్యధిక కాలం ఉన్నాడు. 1947లో ఆయన నాలుగోసారి ఎంపికైన కొద్దిరోజులకే చనిపోయాడు.
* తర్వాత- రెండుసార్లకంటే ఎవరూ అధ్యక్ష పదవిలో ఉండటానికి వీల్లేదంటూ అక్కడ చట్టం తెచ్చారు.
* అమెరికాలోని టెన్నిసన్‌ రాష్ట్రంలో 1967 దాకా ఎవరైనా కోతుల నుంచి మనిషి వచ్చాడని చెబితే కేసు పెట్టేవారు!
* మనదేశంలోని వివిధ భాషల అక్షరాలన్నీ వేరువేరుగా అనిపిస్తాయి కానీ... ఇవన్నీ బ్రాహ్మీ లిపి నుంచి వచ్చినవే!
* పెళ్లీ, విడాకులకి సంబంధించి గోవాలో పోర్చుగీసు చట్టాలూ, పుదుచ్చేరిలో ఫ్రెంచివాళ్ల చట్టాలే అమలవుతున్నాయి!
* మిక్కీ ‘మౌస్‌’ని మొదట ఆస్వాల్డ్‌ అనే ఉడతగానే గీసి వీడియోగా తీశారు. ఆ తర్వాతే చిట్టెలుకగా మార్చారు!

* మనిషి తుమ్మినపుడు ఒక మిల్లీ సెకను సమయం గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకే అమ్మమ్మలో నాన్నమ్మలో పక్కన ఉంటే - పిల్లలు తుమ్మినపుడు ‘చిరంజీవ’ అనీ ‘శతాయుష్షు’ అనీ అంటారు.

* అమెరికాలోని ప్రఖ్యాత స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని మొదట ఈజిప్టు దేశంలో ఏర్పాటు చేయడానికని డిజైన్‌ చేశారు!

* కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇండోనేషియా, టర్కీ వంటి 25 దేశాలకి - ఎన్నికలప్పుడు వేలికి రాసే నల్ల సిరాని సరఫరా చేసేది భారతదేశమే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.