close
ఏడు కొండలకు ఆ పేర్లు ఎలా వచ్చాయంటే...

తిరుమలలో ఉండే ఏడు కొండలనే సప్తగిరులు అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. ఆ ఏడు శిఖరాల్లో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర...

శేషాద్రి - సప్తగిరుల్లో శేషాద్రి ప్రధానమైంది. ఆదిశేషుని పేరిట నెలకొన్న కొండ. నీలాద్రి - స్వామివారికి మొదటిసారిగా తలనీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరుమీదుగానే ఈ కొండ వెలసింది. గరుడాద్రి - మహావిష్ణువు ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు కొండ రూపంలో ఉద్భవించాడు.
అంజనాద్రి - హనుమంతుని తల్లి సంతానం కోసం తపస్సు చేసిన కొండే అంజనాద్రిగా వెలసింది.
వృషభాద్రి - మహావిష్ణువు చేతిలో హతమైన రాక్షసుడు వృషభాసురుడి పేరిట వృషభాద్రి వచ్చింది.
నారాయణాద్రి - విష్ణుమూర్తి దర్శనం కోసం పుష్కరిణి తీరంలో తపస్సు
చేసిన నారాయణ మహర్షి పేరుతో నారాయణాద్రి వెలసింది.
వేంకటాద్రి - కలియుగ దైవం వెలసిన కొండ ఇది. ‘వేం’ అంటే పాపాలు అనీ, ‘కట’ అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సన్నిధిలో సర్వపాపాలూ నశిస్తాయనీ, అందుకే ఆ పవిత్ర గిరిని వేంకటాద్రి అంటారనీ ప్రతీతి.

22 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.