close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చట్టం, న్యాయం, ధర్మం

‘చట్టం, న్యాయం, ధర్మం...అన్నీ ఒకటే కదా, తేడా ఏముంది?’ ప్రవచనాలు చెబుతున్న స్వామీజీని అడిగాడు సురేష్‌. దానికి ఆయన చెప్పిన సమాధానం - ‘నువ్వు వ్యాపారంలో నష్టపోయి దిక్కుతోచకుండా ఉన్నప్పుడు నీ స్నేహితుడు ఎలాంటి ప్రామిసరీ నోటు కానీ గ్యారెంటీ కానీ లేకుండా నీకు ఐదు లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. దాంతో నువ్వు మళ్ళీ వ్యాపారం చేసి బాగా వృద్ధిలోకి వచ్చావు. ఈలోపు నీ స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సంపాదన మార్గంలేక అతడి కుటుంబం ఆర్థికంగా చితికిపోయి రోడ్డునపడింది.
* నీ స్నేహితుడు నీకు అప్పు ఇచ్చినట్లు ఎలాంటి రుజువులూ సాక్ష్యాలూ లేవు కాబట్టి నువ్వు తీసుకున్న ఐదు లక్షలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు... ఇది చట్టం.
* నీ స్నేహితుడు ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి... ఇది న్యాయం.
* డబ్బును వడ్డీతో సహా తిరిగిచ్చి, నీ స్నేహితుడి కుటుంబం మళ్ళీ నిలదొక్కుకునే దాకా అండగా నిలబడాలి... ఇది ధర్మం.’


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు