close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సిల్లీపాయింట్‌

ప్రపంచంలోనే మొదటిగా స్వీడన్‌లో 2023 కంతా డబ్బు చలామణిని నిషేధించబోతున్నారు. ఇప్పటికే అక్కడి 95 శాతం మంది డిజిటల్‌ లావాదేవీలకి అలవాటుపడిపోయారట!
* మొసలి అనగానే... భయపడిపోతాం కానీ మనదేశ నదుల్లో ఉండే ఘరియల్‌ మొసళ్లు చేపల్ని తప్ప వేటినీ తినవు. వాటి నోరు అంతకన్నా పెద్దగా తెరుచుకోదు!
* లియొనార్డో డావించీ గీసిన ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా చిత్రం... చాలాకాలంపాటు ఫ్రాన్స్‌ మహావీరుడు నెపోలియన్‌ పడగ్గదిలో ఉండేది!
* మనదేశంలో తొలి టీవీ కమర్షియల్‌ యాడ్‌ గ్వాలియర్‌ సూటింగ్స్‌కి సంబంధించింది. ‘లైక్‌ ది వార్మ్‌త్‌ ఇన్‌ యువర్‌ హ్యాండ్స్‌’ (మీ చేతుల్లోని వెచ్చదనం లాంటిది!) అనే దాని నినాదం 1970-80ల్లో బాగా పాపులర్‌!
* ఇప్పటిదాకా చందమామపైన అడుగుపెట్టిన వాళ్ల సంఖ్య... 24.
* ప్రపంచయుద్ధంలో సైనికులుగా పాల్గొన్న అమ్మాయిలు ప్యాంట్లు వాడటం కారణంగానే... పాశ్చాత్య దేశాల్లో ఆడవాళ్లందరూ స్వేచ్ఛగా వాటిని ధరించి బయటకి రావడం మొదలైంది!
* 19వ శతాబ్దం నుంచి 1966 దాకా ఇరాన్‌, ఇరాక్‌, కువైట్‌, సౌదీ అరేబియా, ఖతార్‌, యూఈఏ, ఒమన్‌... ఈ దేశాల్లో భారత రూపాయలే చలామణిలో ఉండేవి.
* భారత జాతీయ పక్షి నెమలి కదా... నేపాల్‌ జాతీయపక్షి మోనల్‌, జపాన్‌ జాతీయ పక్షి కిజి, థాయ్‌లాండ్‌-సియామీన్‌ థైర్‌బ్యార్‌, బర్మా-నల్ల కోడి, శ్రీలంక-పుంజు... ఇవన్నీ కూడా నెమలి జాతికి చెందినవే!
* పాము కళ్ళకు రెప్పలుండవు. ఒంటెలకు మూడు కనురెప్పలు ఉంటాయి.
* తల్లి గర్భంలో బిడ్డ ఎదిగే సమయం... మానవుల్లో తొమ్మిది నెలలు కదా, ఏనుగుల్లో అది 22 నెలలు.
* మేకల కనుపాపలు గుండ్రంగా కాక దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి.
* 20వ శతాబ్దం దాకా కేరళ రాష్ట్ర అధికారభాష... తమిళమే! 16వ శతాబ్దం వరకు కూడా మలయాళానికంటూ అధికారిక లిపి లేదు.

* మన ఆహార పంటల్లో మూడో వంతు వాటి ఉత్పత్తికి ప్రధాన కారణం... తేనెటీగలే!

* ప్రపంచంలో నూటికి ఎనిమిది మందికి నీలిరంగు కళ్ళుంటాయి. మెలనిన్‌  తక్కువగా ఉండటం వల్ల నీలికళ్ళ వ్యక్తులు తీక్షణమైన సూర్యకాంతిని భరించలేరు, వీరు పగలుకన్నా రాత్రి బాగా చూడగలుగుతారు.

* ఆస్కార్‌ విజేతల ఎంపికకి... న్యాయనిర్ణేతలు ఎనిమిదివేలమంది ఉంటారు!

* మహావీరుడు అలెగ్జాండర్‌ చెల్లెలి పేరు... క్లియోపాత్ర! విషయమేంటంటే... రోమన్‌ చరిత్రలో ఆ పేరుతో ఏడుగురు రాణులున్నారు. మనకు బాగా తెలిసిన సీజర్‌ భార్య క్లియోపాత్ర ఏడో మహారాణి!
* మనం ప్రేమించే వ్యక్తులను చూసినప్పుడు కంటిపాప పరిమాణం దాదాపు రెట్టింపు అవుతుంది!

1 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.