close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిల్లీపాయింట్‌

న శరీరంలోని కణాలకన్నా బ్యాక్టీరియా పదిరెట్లు ఎక్కువ!
* ఆస్ట్రేలియా దేశ విస్తీర్ణం కంటే సహారా ఎడారి పెద్దది.
* పుట్టగొడుగుల జాతికి చెందిన ట్రఫిల్‌ చాలా అరుదుగా దొరుకుతాయి... అద్భుతమైన సువాసనా, రుచులతో ఉంటాయి. అందుకే వాటిని ఐరోపాలో ‘వంటింటి వజ్రం’ అంటుంటారు... వేలంపాటతోనే కొంటారు. రెండుకిలోల బరువున్న ఓ ట్రఫిల్‌ ఆ మధ్య 4.25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది!
* క్రైస్తవ సన్యాసులు ఉండే గదుల్ని ‘సెల్స్‌’ అంటారు. శరీర కణాలని తొలిసారి మైక్రోస్కోపులో చూసినప్పుడు వాటి ఆకారం కూడా ఆ గదుల్లాగే ఉండటంతో... వాటిని ఇంగ్లిషులో సెల్‌ అనడం ప్రారంభించారు. ఒకప్పటి మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్ల టవర్‌ల ఆకారం కూడా ఇదే కాబట్టి వాటిని సెల్‌ఫోన్‌లు అని పిలిచారు!
* మన భూమికి 40 కాంతి సంవత్సరాల దూరంలో ‘55 కాన్‌క్రీ సి’ అనే గ్రహం ఉంది. భూమికంటే రెండింతలుండే ఈ గ్రహంలో 75 శాతం వజ్రమేనట!
* పిల్లి, పులి, సింహం... వీటికి తీపి రుచి తెలియదు!
* అంగారకుడి పైనుంచి చూస్తే ఆకాశం పసుపు రంగులోనే ఉంటుంది. సూర్యోదయాలూ, సూర్యాస్తమయాల్లో మాత్రమే నీలిరంగుకి తిరుగుతుంది!
* మనుషులు రోజుకి సగటున 25 వేల సార్లు... శ్వాస పీల్చి, వదులుతారు.

* జాకీచాన్‌ ‘చైనీస్‌ జోడియాక్‌’ సినిమాలో హీరోగా చేస్తూనే కథారచన, దర్శకత్వం, నిర్మాణ పర్యవేక్షణ, కెమెరా, ఆర్ట్‌డైరెక్షన్‌, సంగీత దర్శకత్వం, కేటరింగ్‌ మేనేజ్‌మెంట్‌ అంటూ 15 బాధ్యతలు వహించాడు. ఓ సినిమా కోసం ఒక వ్యక్తి ఎక్కువ బాధ్యతలు నిర్వహించడంలో ఇదే ప్రపంచ రికార్డు!

* కప్పలు వర్షం కోసం తపస్సు చేస్తాయని మనవాళ్ల నమ్మకం కదా! నిజానికి, అవి నీటిని నోటితో తాగలేవు... కేవలం చర్మం ద్వారా గ్రహిస్తాయంతే.

* న్యూజిలాండ్‌లో మనుషులకంటే గొర్రెల సంఖ్య ఎక్కువ!

* 1995 జులై 31న... నాటి పశ్చిమ బంగ ముఖ్యమంత్రి జ్యోతిబసు... అప్పటి కేంద్ర కమ్యూనికేషన్స్‌ మంత్రి సుఖ్‌రామ్‌కి కాల్‌ చేశారు. మనదేశంలో తొలి మొబైల్‌  ఫోన్‌ కాల్‌ అదే!

* వానాకాలమంటే మనకి తూనీగల కాలం కూడా! ప్రతి వర్షాకాలం చివర్న భారత్‌ నుంచి బయల్దేరే తూనీగలు... ఏడాది చివరికి ఆఫ్రికా చేరుకుంటాయి. అయితే ఏంటంటారా... ప్రపంచంలో అత్యధిక దూరం (దాదాపు 17 వేల మైళ్లు) ప్రయాణించే కీటకాలు ఇవే మరి!

* సొరచేపలకి శాశ్వత దంతాలుండవు! వచ్చీ... రాలి... మళ్లీ వస్తుంటాయి. అలా ఒక సొరచేప జీవితంలో 30 వేల పళ్లు వస్తాయని అంచనా!

* మన ఆఘ్రాణశక్తి... పగలు కంటే సాయంత్రంవేళ ఎక్కువగా ఉంటుందట!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.