close
ఒక్కరోజు వనవాసం...

నెదర్లాండ్స్‌లో పిల్లల్ని తల్లిదండ్రులు వనవాసానికి పంపిస్తారు. అలాగని సంవత్సరాలూ, నెలలూ అనుకోకండి. ఒకే ఒక్కరోజు. ఏటా వేసవిలో టీనేజ్‌లో అడుగుపెట్టిన, పెట్టబోతున్న పిల్లల్ని ముగ్గురు నలుగురు చొప్పున ఒక బృందంగా ఇంటి నుంచి కారులో తీసుకువెళ్లి దగ్గర్లోని ఓ అడవిలో విడిచిపెడతారు. కొందరికైతే దారి కూడా తెలియకూడదని కళ్లకు గంతలు కట్టి మరీ తీసుకెళ్తారు. వాళ్లు ఆ రాత్రంతా అడవి గుండా నడుస్తూ తోవ వెతుక్కుంటూ బయటపడి తెల్లవారేసరికి ఇంటిని చేరుకోవాలి. యాత్ర సమయంలో వారికి రక్షణ పరంగా అవసరమైన అన్ని సదుపాయాల్నీ కల్పిస్తారు. మ్యాపులూ, టార్చిలైట్‌లూ, దిక్సూచీ లాంటివి ఇస్తారు. ఈ సాహసయాత్ర కొన్ని గంటలపాటు కొనసాగుతుంది. ‘అడవుల్లోనా, రిస్కు కాదూ’ అని సందేహమా! అడవులంటే మరీ పెద్దవి కాదు. నాలుగైదు చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉండే చిన్నపాటి అడవులు. అడవి మరీ పెద్దదైతే ఈ బృందానికి ఓ పెద్ద వ్యక్తి సహాయకుడిగా ఉంటాడు. జీవితంలో సొంతంగా బతికేందుకు అవసరమైన ధైర్యసాహసాల్ని పెంపొందించడమే ఈ యాత్ర లక్ష్యమట. కొన్నిసార్లు పెద్ద బృందాలుగా ఏర్పడి కాస్త పెద్ద అడవుల గుండానూ ఈ యాత్రల్ని చేస్తున్నారు పిల్లలు. బెల్జియంలాంటి మరికొన్ని ఐరోపా దేశాల్లోనూ ఈ సంప్రదాయం ఉంది. స్మార్ట్‌ఫోన్ల కాలంలోనూ ఇలాంటి సంప్రదాయం ఉండటం నిజంగా గ్రేట్‌ కదా!

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.