close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సిల్లీపాయింట్‌

న భూమికి పదివేల కాంతి సంవత్సరాల దూరంలో అక్విలా అనే ఓ నక్షత్రరాశి ఉంది. దాని చుట్టూ ఓ పె..ద్ద మేఘం ఆవరించుకుని ఉంటుంది. ఆ మేఘంలో ఈథైల్‌ ఆల్కహాల్‌ వాయువు పుష్కలంగా ఉందట. ఆ వాయువుతో రెండు లక్షల కోట్ల కోట్ల(200 ట్రిలియన్‌ ట్రిలియన్‌లు) లీటర్ల మద్యాన్ని తయారుచేయవచ్చట.
* పెంగ్విన్‌లలో గుడ్లని మగపక్షులు మాత్రమే పొదుగుతాయి.
* రిజర్వ్‌బ్యాంకుని హిందూ  పురాణాల్లోని ధనాధిదేవత కుబేరుడిగా భావిస్తారు. అందుకే దాని ప్రధాన కార్యాలయానికి ఇరువైపులా కుబేరుడికి ఉన్నట్టే రెండు యక్షిణీ విగ్రహాలని పెట్టారు!
* SET... చూడటానికి మూడక్షరాల పదమే కానీ 430 దాకా అర్థాలున్నాయి దీనికి. అందుకే, ఇంగ్లిషులోని ప్రతి ప్రామాణిక డిక్షనరీ దీనికి 6,600 పదాల నిర్వచనాలు ఇచ్చి తీరాలి. ఇంగ్లిషులో మరే పదానికీ అంత వివరణ అక్కర్లేదు!
* సొరచేప దంతాలు చాలా పెద్దవిగా ఉన్నా గట్టిదనంలో మనిషి దంతాలు వాటికి ఏమాత్రం తీసిపోవట!
* మనిషి బరువులో 8 శాతం రక్తానిదే ఉంటుందట!
* మైనస్‌ 40 డిగ్రీల కంటే ఎక్కువ చలి ఉండే అంటార్కిటికాకి వెళ్లేవాళ్లుండరు... అరుదుగా కొందరు పరిశోధకులు తప్ప. అయినా సరే... అక్కడా ఒక ఏటీఎంని ఏర్పాటుచేసింది అమెరికాకి చెందిన వేల్స్‌ ఫార్గో బ్యాంకు!
* మహారాష్ట్రలోని శ్రీరాంపూర్‌, బెలార్‌పూర్‌ గ్రామాలు రైలు పట్టాలకు అటొకటీ ఇటొకటీ ఉంటాయి. దాంతో రెండు గ్రామాలకీ కలిపి ఒకే స్టేషన్‌ ఉన్నట్టు అనిపిస్తుందికానీ... ఒకవైపు ప్లాట్‌ఫామ్‌పైన శ్రీరాంపూర్‌ అనీ, ఇంకోవైపున బెలార్‌పూర్‌ అనీ బోర్డులుంటాయి. రెంటినీ వేర్వేరు స్టేషన్‌లుగానే పరిగణిస్తుంది రైల్వే!


* బ్రిటన్‌లో మహారాణి పేరుమీదే పాస్‌పోర్టులు జారీ చేస్తారు. కానీ, ఆమె ఏ విదేశానికి వెళ్లాల్సి వచ్చినా పాస్‌పోర్టు అక్కర్లేదు. ప్రపంచంలో మరే దేశాధినేతకీ ఆ మినహాయింపు లేదు!


* పోలికలో పులికి దగ్గరగా అనిపిస్తుంది కానీ... చిరుతపులి పులిలా గాండ్రించదు. పిల్లిలా కూత పెడుతుందంతే!


* పిల్లలు పుట్టిన క్షణం నుంచీ ఏడుస్తుంటారు కానీ వాళ్ళకి కన్నీళ్ళు రావు. పుట్టిన నెల తర్వాత మాత్రమే పిల్లలకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి.

* ఐస్‌లాండ్‌లో దోమలుండవు. బయటి దేశాల నుంచి తెచ్చినా అక్కడ బతకవు!
* ఐరోపా ప్రజలు 18వ శతాబ్దం దాకా- టొమాటోలు తింటే మనుషులు చనిపోతారని నమ్మేవాళ్లు!
* ఫ్లెమింగో పక్షి, సాల్మన్‌ చేపల శరీరం రంగు అవి తినే ఆహారాన్ని బట్టి మారుతుంటుంది.
* ఐస్‌లాండ్‌ దేశంలో ప్రజలు తమ పిల్లలకి ప్రభుత్వం సూచించిన పేర్లు మాత్రమే పెట్టాలి!
* దక్షిణాఫ్రికా పీటర్స్‌మారిట్జ్‌బర్గ్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో బౌండరీలైన్‌ లోపలే ఓ పెద్ద ఓక్‌ చెట్టుంటుంది. బ్యాట్స్‌మ్యాన్‌ కొట్టే బంతి ఈ చెట్టుకి ఎక్కడ తగిలినా దాన్ని ఫోర్‌గా పరిగణించాలన్నది అక్కడ రూల్‌!

4 ఆగస్టు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.