close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పోదామా... పల్లె‘టూరు’

‘ఈ జనరేషన్‌కి వ్యవసాయం అంటే ఏంటో తెలియట్లేదు. ఇంకా రాబోయే తరానికి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్‌లో మిగిలిపోతుంది’ అని ‘మహర్షి’ సినిమాలో ఓ డైలాగ్‌. ఆ మాటలు వందశాతం నిజం. ఎనిమిదేళ్ల క్రితమే ఈ పరిస్థితిని గమనించిన నివేదిత ముమ్మడి మట్టికీ రైతుకూ ఉన్న బంధాన్ని చిన్నారులకు దగ్గరగా చూపుతోంది. పల్లెసొగసులూ, జీవసంపదా, చేతివృత్తుల వంటివెన్నో పరిచయం చేస్తోంది.

తకడానికి తిండి అవసరమైన ప్రతి ఒక్కరికీ వ్యవసాయంతో సంబంధం ఉంది. కానీ అలాంటి వారందరూ వ్యవసాయం చేసే రైతుతో అనుబంధం లేకుండానే బతుకున్నారు అని బాధపడిన నివేదిత 2012లో ‘డర్టీ ఫీట్‌’ను స్థాపించింది.
ఈస్టార్టప్‌ ద్వారా వ్యవసాయం, రైతులూ, పాడీ, పనిముట్లూ, కులవృత్తులూ, ఆటలూ, సీజనల్‌ పండ్లూ... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నింటికో పిల్లలను దగ్గర చేస్తుంది.

రూరల్‌మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసిన నివేదిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు స్వచ్ఛంద సంస్థల్లో పని చేసింది. కృష్ణాజిల్లాలోని అగాఖాన్‌ ఫౌండేషన్‌ తరఫున దివిసీమలో సునామీ సహాయక చర్యల్లో పాల్గొన్న నివేదిత ఓ నాలుగైదేళ్ల తరువాత ఆ ప్రాంతానికి వెళ్లాలనుకుంది. ఆ సమయంలో పన్నెండేళ్ల నివేదిత అక్కకొడుకు వెంటవెళ్లాడు. అప్పటి వరకూ పల్లెలూ వ్యవసాయమంటే తెలియని ఆ పిల్లాడు మత్య్సకారులు చేపల పట్టడం చూసి ముచ్చటపడిపోయాడు. కాలవగట్లూ, పంటపొలాల్లో కేరింతలు కొట్టాడు. అదంతా దగ్గరగా చూసిన నివేదిత నగరవాసులు రైతు శ్రమనీ, పల్లెబతుకులో సౌందర్యాన్నీ చూడలేకపోతున్నారని బాధపడింది. అవన్నీ తానే చూపించాలనే ఉద్దేశంతో ‘డర్టీ ఫీట్‌’ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆ ఆలోచన నచ్చిన స్నేహితురాలు అర్చనా లోంధే భాగస్వామిగా చేరింది.

నమ్మకం కలిగాకే...
ముందుగా తెలిసిన పిల్లల్ని తీసుకొని ట్రయల్‌ రన్‌లా పల్లెలకు తీసుకెళ్లింది నివేదిత. ఆ వాతావరణం నచ్చడంతో వాళ్లంతా ఎంతో సంబరపడిపోయారు. ‘మళ్లీ మళ్లీ ఇలా వెళితే ఎన్ని విషయాలు తెలుస్తాయో’ అని అనడంతో మంచి ప్రయత్నమేనని నివేదితకి నమ్మకం కుదిరింది. టూర్‌లో భాగంగా ఏదో ఒక పంటను చూపించి ఇదే వ్యవసాయం అని చెప్పడం కాకుండా.. పంటల్లో ఎన్ని రకాలుంటాయో చూపిస్తారు. భూముల్లోని రకాలూ, వాటిల్లో పండే పంటలూ, నీటివసతీ, వ్యవసాయపనిముట్లూ పరిచయం చేస్తారు. చేనేతలూ, మత్స్యకారులూ, కుమ్మరీ వంటి వృత్తులవారి పనీ, జీవనవిధానాన్ని పరిచయం చేస్తారు. కనీస వసతులు లేని కోయగ్రామాలూ, గిరిజన ప్రాంతాలూ, తండాలకూ తీసుకెళతారు.  ఉదయం లేచిన దగ్గర్నుంచీ వారి దినచర్యతోపాటూ సంపాదన వెనక ఉండే కష్టాన్నీ శ్రమనూ కళ్లకు కడతారు. ఈ విధంగా వివిధ రకాల కమ్యూనిటీలను థీమ్‌లుగా విభజించి థీమ్‌ బేస్డ్‌ టూర్లూ ఏర్పాటు చేస్తుంది డర్టీ ఫీట్‌.

థీమ్‌బేస్డ్‌ టూర్లున్నాయి...
వారాంతంలో ఏర్పాటు చేసే ఈ టూర్లకు ఎవరైనా పిల్లల్ని పంపొచ్చు. మిగతా రోజుల్లో స్కూళ్ల యాజమాన్యాలూ, కాలేజీ పిల్లలూ, కార్పొరేట్‌ ఉద్యోగినులూ, ఫ్యామిలీ గ్రూపులు కిట్టీ పార్టీ చేసుకునే మహిళలకోసం కస్టమైజ్డ్‌ టూర్లు నిర్వహిస్తారు. రైతులూ, వృత్తిపని వారే పిల్లలకు గైడ్‌లా విషయాలన్నీ చెబుతారు. స్థానిక కథలూ, గాథలూ, యక్షగానాలూ, చిత్రకళలూ పరిచయం చేస్తారు. సాయంత్రం అక్కడే ఉండాల్సి వస్తే వసతి కల్పించి వారు తినేదే చిన్నారులకూ పెడతారు. పల్లెల్లో పిల్లలకు ఈ జ్ఞాపకాలూ, అనుభవాలూ, అనుభూతులూ పంచేవారందరికీ డర్టీఫీట్‌ డబ్బు చెల్లిస్తుంది. ఈ టూర్ల వల్ల పిల్లలకు విజ్ఞానం... పల్లెలకు ఆదాయం అందాలన్నదే నివేదిత లక్ష్యం.

30 జూన్‌ 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.