close
రంగుల ఐస్‌క్రీమ్‌ రుచి చూశారా?! 


వెనీలా, స్ట్రాబెర్రీ, బటర్‌స్కాచ్‌, టూటీఫ్రూటీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఐస్‌క్రీమ్‌లో ఫ్లేవర్లూ రంగులూ లెక్కలేనన్ని. అయితే ఇప్పుడు వాటన్నింటినీ పక్కకి నెట్టేసి చిన్నా పెద్దా అందర్నీ నోరూరిస్తోంది యూనికార్న్‌... రంగురంగుల ఐస్‌క్రీమ్‌.

దుస్తుల్ని కొనేటప్పుడు ముందు చూసేది రంగే. అది నచ్చాకనే డిజైన్‌ గురించి ఆలోచిస్తాం. ఆహారం విషయంలోనూ అంతే. చూడ్డానికి బాగుంటేనే రుచి చూస్తాం. ఈ సూత్రాన్ని అనుసరించే ఈమధ్య తినేవాటికన్నింటికీ ఆరోగ్యకరమైన సహజ రంగుల్ని అద్దేస్తున్నారు. అలా పుట్టుకొచ్చిందే యూనికార్న్‌ ఐస్‌క్రీమ్‌. నీలం, గులాబీ, ఊదా, పసుపు రంగులన్నీ కలగలిపి చేసే ఈ లేలేత రంగుల ఐస్‌క్రీమ్‌ కళ్లకు ఆహ్లాదకరంగానూ ఉంటుంది. అందులో వాడే రంగుల్నీ విభిన్న పండ్లరసాలతోనే చేస్తున్నారు కాబట్టి రుచీ అద్భుతమే అంటున్నారు ఐస్‌క్రీమ్‌ ప్రియులు.

అసలేమిటీ యూనికార్న్‌! 
స్ట్రాబెర్రీ, కొబ్బరి... ఇలా ఆ ఐస్‌క్రీమ్‌ పేరు చెప్పగానే ఆ పండో కాయో స్ఫురిస్తాయి. మరి ఈ యూనికార్న్‌ ఏమిటీ అనిపించడం సహజమే. యూనికార్న్‌ అనేది ఊహాచిత్రం. ఓ కాల్పనిక పాత్ర. గుర్రం, మేక, కలగలిసిన శరీరం, సింహాన్ని పోలిన జూలు, కుచ్చులాంటి గుర్రం తోక, ఒంటికొమ్ముతోనూ ఉండే విచిత్రమైన అడవి జంతువు. సింధునాగరికత నాటి నాణేలపై ఈ జంతువు బొమ్మ కనిపించడంతో ఒకప్పుడు అలాంటి జంతువు ఒకటి భారత్‌లో నివసించేదని గ్రీకు చరిత్రకారులు చెప్పుకొచ్చారు. ఆ సంగతెలా ఉన్నా యూనికార్న్‌ను మహిమాన్వితమైనదిగా భావిస్తూ కథలు అల్లేస్తూ వేడుకలూ చేసుకుంటారు ఐరోపా, అమెరికా వాసులు. యూనికార్న్‌ బొమ్మలూ పాపులరయ్యాయక్కడ.

మొదట్లో యూనికార్న్‌కి కొమ్ము మాత్రమే సంకేతం. తరవాత తలమీదా మెడ దగ్గరా తోకకి ఉండే జుట్టుకి లేత నీలం, గులాబీ, ఊదా, పసుపు రంగుల్ని అద్దేస్తూ దానికో ప్రత్యేక లుక్‌ తీసుకొచ్చారు. ఆ లేత హరివిల్లు రంగులతో ఫ్యాషన్లూ మొదలయ్యాయి. అందరికీ ఇష్టమైన ఐస్‌క్రీమ్‌లో మాత్రం ఆ రంగుల్ని ఎందుకు చొప్పించకూడదూ అనుకున్నట్లున్నారు షెఫ్‌లు... వెనీలా ఐస్‌క్రీమ్‌ను తీసుకుని; దాన్ని నాలుగైదు భాగాలుగా చేసి; మామిడి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బీట్‌రూట్‌... ఇలా ఒక్కోదాంట్లో ఒక్కో పండ్లరసాన్ని పోసి కలిపేశారు. ఓ పెద్ద గిన్నెలో ఒక్కో రంగు క్రీమ్‌ని వేసి కలుపుతూ చివరలో మొత్తంగా అన్నీ కలిపి మళ్లీ ఫ్రీజ్‌ చేసి, రంగురంగుల టాపింగ్స్‌ చల్లేస్తే అందమైన రుచికరమైన యూనికార్న్‌ ఐస్‌క్రీమ్‌ తయార్‌ అంటూ నెట్టింట్లో పెట్టేయడంతో అందరికీ ఇది తెగ నచ్చేసింది. యూనికార్న్‌ థీమ్‌ ఐస్‌క్రీమ్‌ పార్టీలూ మొదలయ్యాయి. దాంతో దిల్లీ గల్లీ పార్లర్ల నుంచి ఐస్‌క్రీమ్‌ కంపెనీలు సైతం దీన్ని తయారుచేయక తప్పలేదు. ఓ కల్పిత పాత్రకి అద్దిన రంగులు ఓ ఐస్‌క్రీమ్‌ ట్రెండ్‌కి కారణమవడం విశేషమే కదూ! 


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.